BCCI: బీసీసీఐ దెబ్బకు విలవిలలాడుతోన్న పాకిస్థాన్..!
బీసీసీఐ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డు విలవిలలాడుతోంది. డబ్బులు లేక సహా హోస్ట్ గా వ్యవహరించిన శ్రీలంకపై ఒత్తిడి తీసుకొస్తోంది. గత సంవత్సరం ఆసియ కప్ 2023 ని పాకిస్థాన్ నిర్వహించింది. అయితే భారత్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని మ్యాచుల్ పాకిస్థాన్ లో మరి కొన్ని మ్యాచులు శ్రీలంకలో నిర్వహించారు.
భారత్ ఆడిన మ్యాచులన్నింటికీ శ్రీలంక అతిథ్యమిచ్చింది. అయితే మ్యాచులు నిర్వహించాలంటే ఖర్చులు ఎక్కువుంటాయి. ముఖ్యంగా రెండు దేశాల్లో మ్యాచులు జరపడంతో ఖర్ఛు భారీగా అయింది. ఈ ఖర్చులను సహా హోస్ట్ గా వ్యవహరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా భరించాలని పాక్ క్రికెట్ బోర్డు పట్టుబడుతోంది. ఖర్చులు భరించేందుకు శ్రీలంక నిరాకరిస్తోంది.

పాక్ నుంచి శ్రీలంక.. శ్రీలంక నుంచి పాక్ చార్టర్డ్ ఫ్లైట్స్, హెటల్ ఖర్చులు ఇవన్ని కలిసి తడిసిమొపడయ్యాయి. దీంతో ఖర్చును తగ్గించుకునేందుకు శ్రీలకం క్రికెట్ బోర్డును బయటకు లాగింది. సహా హోస్ట్ కావాలని కోరలేదని.. భారత్ పాక్ రానందన.. తాము సహా హోస్ట్ వ్యవహారించామని శ్రీలంక స్పష్టం చేసింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసేది ఏమి లేక.. తమ నుంచి హోస్టింగ్ హక్కులు తొలగించిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. నిధులు ఇవ్వకుంటే కేసు వేస్తామని బెదిరింపులకు దిగింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా మాత్రం శ్రీలంకను సహా హోస్ట్ గా ఉపయోగించుకున్నందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ శ్రీలంకకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications