World Cup 2023: మహ్మద్ షమీకి హీరోయిన్ బంపరాఫర్ - ఏం కావాలి, నేను సిద్దం..!!
ప్రపంచ కప్ లో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి ఊహించని ఆఫర్ వచ్చింది. నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా షమీకి తన ఆఫర్ ఏంటో బయట పెట్టింది. షమీ ఈ ప్రపంచ కప్ లో 16 వికెట్లు పడగొట్టి టాప్ లైన్ లో ఉన్నాడు. భారత్ విజయాల్లో కీలకంగా మారిన షమీ పైన ఇప్పుడు ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు పెరిగాయి. సెమీస్ మ్యాచ్ కు సిద్దం అవుతున్న వేళ ఈ బాలీవుడ్ బ్యూటీ నుంచి షమీకి వచ్చిన ఆఫర్ వైరల్ అవుతోంది.
షమీకి నటి ప్రొపోజ్:మహ్మద్ షమీ వరుస వికెట్లు తరువాత తన పెళ్లి..విడాకుల అంశం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇక, ఇప్పుడు పూర్తిగా తన సూపర్బ్ బౌలింగ్ తో ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకున్న షమీ కు ఒక నటి పెళ్లి చేసుకుంటానంటూ ఆఫర్ ఇచ్చింది. నటి పాయల్ ఘోష్ ఈ మేరక షమీకి ప్రొపోజ్ చేసింది. ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా ఘోష్ నటించింది. ఇదే సమయంలో షమీని పెళ్లి చేసుకోవటానికి ఒక కండీషన్ విధించింది. షమీ..నువ్వు ఇంగ్లీష్ ను మెరుగుపరుచుకో, నేను నిన్న పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా ఉన్నాను అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

నేను ఏం చేయాలంటూ:దీనికి కొనసాగింపుగా పాయల్ ఘోష్ మరో ట్వీట్ చేసింది. అందులో మహ్మద్ షమీ.. సెమీ ఫైనల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయటానికి తన నుంచి ఏ సాయం కావాలో చెప్పాలని కోరింది. ఆ మ్యాచ్ లో షమీ హీరో కావాలని కోరుంటున్నానని పాయల్ చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ ఘోష్ ట్వీట్ కు స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే పాయల్ ఘోష్ ఈ తరహా ట్వీట్లు చేసిందనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. షమీకి 2014 లో హసీన్ జహాన్ తో పెళ్లి జరిగింది. 2015 లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018 లో షమీ వేధిస్తున్నాడంటూ హసీన్ వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో ఇటీవలే కోర్టు తీర్పు వచ్చింది. ప్రతీ నెలా హసీన్ కు లక్షా 30 వేల రూపాయాలు భరణంగా చెల్లించాలని కోర్టు షమీని ఆదేశించింది.
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
అంచనాలకు మించి:ప్రపంచ తొలి నాలుగు మ్యాచ్ లకు షమీకి అవకాశం దక్కలేదు. తరువాత షమీ ఎంట్రీ ఇస్తూనే తన సామర్ధ్యం ఏంటో బాల్ తో నిరూపించాడు. ఇక షమీని పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. టీమిండియా వరుస విజయాల్లో కీలకంగా మారాడు. టీమిండియా పేస్ త్రయంలో బూమ్రా, సిరాజ్, షమీ ముగ్గురు దెబ్బకు మిగిలిన టీం బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక..నెదర్లాండ్స్ తో మ్యాచ్ తరువాత రోహిత్ టీం సెమీస్ ఆడనుంది. న్యూజీలాండ్ తో అయితే ముంబాయిలో..పాకిస్థాన్ తో అయితే కోల్ కతాలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, గత అనుభవాలు వెంటాడుతున్న వేళ.. ఈ సారి వాటిని అధిగమించి టీమిండియా ముందుకు వెళ్తుందని కోట్లాది మంది ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications