అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ISSO నేషనల్ గేమ్స్ చెస్ కాంపిటీషన్.. విన్నర్స్ వీళ్లే
అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ISSO నేషనల్ గేమ్స్ చెస్ పోటీలు-2025 నిర్వహించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా పదికి పైగా రాష్ట్రాల నుంచి 80 కు పైగా స్కూళ్లకు చెందిన 370 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్ కు తల్లిదండ్రులు, కోచ్ లు సహా మొత్తం 650 మందికి పైగా హాజరయ్యారు.
ఈ పోటీలను అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19.. ఇలా నాలుగు రకాల కేటగిరీల్లో నిర్వహించారు. గుజరాత్ లోని శాంతిగ్రామ్ లో ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు నైపుణ్యం, ఒత్తిడిలో నిలకడ తదితర స్కిల్స్ ను ప్రదర్శించారు. అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రమోటర్ శ్రీమతి నమ్రత అదానీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె విద్యార్థులతో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా గుజరాత్ స్టేట్ చెస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, అఖిల భారత చెస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు భావేష్ పటేల్, గ్రాండ్ మాస్టర్ అంకిత్ రాజ్ పరాలు విద్యార్ధులకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందించారు. క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి సంస్థలు నిర్వహించే టోర్నమెంట్లు యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. లక్ష్య సాధనలో తోడ్పడతాయి. ఈ వేదికల ద్వారా భారత్ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లకు అవసరమైన క్రీడాకారులను రూపొందించవచ్చు.
రెండు రోజుల టోర్నమెంట్ అనంతరం ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో నాలుగు విభాగాలలో గెలుపొందిన విద్యార్ధులకు పతకాలను అందించారు. టోర్నమెంట్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ పతకాన్ని ముంబైలోని చత్రభుజ్ నర్సీ స్కూల్ గెలుచుకుంది. హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రన్నర్స్-అప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రెండు స్కూల్స్ కు చెందిన విద్యార్ధులు నాలుగు విభాగాల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.
అండర్ 11 విజేతలు: అబ్బాయిలు: ఆయాన్ రాజ్ కొట్టపల్లి (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్), అనయ్ అగర్వాల్ (ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్), అహాన్ కటారుక (నితా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్). అమ్మాయిలు: అమేయ అగర్వాల్ (ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్), తీష బైద్వాల్ (జయశ్రీ పెరివాల్ గ్లోబల్ స్కూల్), మృణ్మయీ దావరే (హెచ్‌వీబీ గ్లోబల్ అకాడమీ).
అండర్ 14 విజేతలు: అబ్బాయిలు: నిర్వన్ నిరవ్ షా (డాన్ బాస్కో ఇంటర్నేషనల్ స్కూల్), అమే జైన్ (రాక్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్), ఉద్భవ్ శర్మ (నీరజా మోడీ స్కూల్). అమ్మాయిలు: నైషా ఖండేల్ వాల్ (నీరజా మోడీ స్కూల్), ఆద్య రెడ్డి కొండ (ది గౌడియం స్కూల్), శ్రేయ తీర్థాని (భారతి విద్యాపీఠ్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్).
అండర్ 17 విజేతలు: అబ్బాయిలు: అమన్ జార్జ్ థామస్ (విద్యాశిల్ప్ అకాడమీ), ఆదిత్య కునాల్ పాటిల్ (ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్), దేవాంష్ ఖండేల్ వాల్ (స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్). అమ్మాయిలు: హసిత రెడ్డి పాటేలు (మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్), అనన్య ఖండేల్ వాల్ (జేబీసీఎన్ ఇంటర్నేషనల్ స్కూల్, పారెల్), సుహానీ లోహియా (ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్).

అండర్ 19 విజేతలు: అబ్బాయిలు: స్పర్ష్ సారవోగి (ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరు), ఆయాన్ సింగ్వి (జయశ్రీ పెరివాల్ ఇంటర్నేషనల్ స్కూల్), కబీర్ టాండన్ (ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరు). అమ్మాయిలు: ఝలక్ బైద్వాల్ (జయశ్రీ పెరివాల్ గ్లోబల్ స్కూల్), ధ్యానా దోషి (ఆదిత్య బిర్లా వరల్డ్ అకాడమీ), నిభా మంచల్ (సంజయ్ ఘోడావత్ ఇంటర్నేషనల్ స్కూల్ జూనియర్).












Click it and Unblock the Notifications