Ravindra Jadeja: టీ20 ఫార్మాట్ కు గుడ్ బాయ్ చెప్పిన రవీంద్ర జడేజా..

టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో ఇండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో యావత్ భారత దేశం సంబరాలు చేసుకుంది. టీమిండియా క్రికెటర్లు కూడా ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అయితే వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియాలో కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు గుడ్ బాయ్ చెప్పాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20 కీలక ఆటగాళ్లు గుడ్ బాయ్ చెప్పడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 ఫార్మాట్ కు గుడ్ బాయ్ చెప్పాడు. రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. "కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను T20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను. అహంకారంతో దూసుకెళ్తున్న దృఢమైన గుర్రంలా, నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం నా అత్యుత్తమమైనదాన్ని అందించాన" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

All rounder Ravindra Jadeja has announced his retirement from the T20 format

"ఇతర ఫార్మాట్‌లలో అలానే కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవడం ఒక కల నిజమైంది, ఇది నా 'టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో పరాకాష్ట. జ్ఞాపకాలు, చిర్స్ మరియు తిరుగులేని మద్దతు కోసం ధన్యవాదాలు" అని జడేజా రాసుకొచ్చాడు. జడేజా చాలా సంవత్సరాలుగా భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2024 ఎడిషన్‌లో కీలకమైన ఆల్ రౌండ్ పాత్రను పోషించాడు. ఇంగ్లండ్‌పైసెమీ-ఫైనల్ జడేజా 9 బంతుల్లో అజేయంగా 17 పరుగులు చేశాడు.

అతను టోర్నమెంట్‌లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, జడేజా 7.57 ఎకానమీ రేట్‌తో స్కోర్ చేయడం ద్వారా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు.దీంతో టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. భవిష్యత్ తరాలకు అవకాశం కల్పించాలని వీరింతా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి టీ20 జట్టులో ముగ్గురు యువ ఆటగాళ్లు అవకాశం లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+