కోహ్లీపై అంబటి కామెంట్స్- ఆ నిర్ణయంలో అర్థమే లేదు
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో సంచలనాత్మక పునరాగమనం చేశాడు. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అతను అజేయ అర్ధసెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రికార్డు విజయాన్ని అందించాడు. కోహ్లీ బ్యాటింగ్ ప్రతాపానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. 15.4 ఓవర్లలో ఆర్సీబీ దీన్ని ఛేదించింది. 200, అంత కంటే ఎక్కువ పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా ఆర్బీసీ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడనేది ప్రత్యేకిం చెప్పనక్కర్లేదు. ఆర్బీసీ మాజీ సహచరుడు, టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన 15వ ఓవర్‌ను భారీ సిక్సర్‌తో ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాతి మూడు బంతులకు మూడు ఫోర్లు బాదాడు. అదే ఓవర్ లో ఛాలెంజర్స్ రాయల్ గా విజయాన్ని అందించాడు. 38 బంతుల్లో అయిదేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు కొట్టాడీ రన్ మెషీన్. 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఈ బ్యాటింగ్ ప్రదర్శన జట్టుకు ఈ రికార్డుస్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది.

కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. 37 ఏళ్ల కోహ్లీ ఇంకా అయిదారేళ్ల పాటు టాప్ లెవెల్ క్రికెట్ ఆడగలడని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌కు తిరిగి రావాలని సూచించాడు. 100 శాతం ఫిట్ నెస్ తో ఉన్న కోహ్లీలో సుదీర్ఘ కాలం పాటు నిలకడగా మెరుపు ఇన్నింగ్ ఆడే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించాడు. టెస్ట్ ఫార్మట్ నుండి తప్పుకోవాలనే నిర్ణయంలో అర్థం లేదని తేల్చి చెప్పాడు.
కోహ్లీ కొన్ని అద్భుత క్రికెటింగ్ షాట్లు ఆడాడని అంబటి రాయుడు గుర్తు చేశాడు. ఏడో ఓవర్‌లో అతను కొట్టిన లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ టోర్నమెంట్ షాట్‌లలో ఒకటిగా నిలుస్తుందని కితాబిచ్చాడు. 10వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌కు అతను కొట్టిన ట్రేడ్‌మార్క్ రిస్ట్ ఫ్లిక్ అత్యద్భుతమైనదిగా అభివర్ణించాడు. క్రిక్ ఇన్ఫో కామెంటరీ బాక్సలో అతను మాట్లాడాడు. టెస్టు క్రికెట్‌కు తిరిగి రావాలని కోహ్లీని కోరాడు. ఇదే అభిప్రాయాన్ని మాజీ భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా వ్యక్తం చేశాడు.
కోహ్లీ తన కెరీర్ ముగింపు దశలో ఉన్నాడని అనుకోవట్లేదని, ఇంకా అయిదారేళ్ల పాటు నాణ్యమైన క్రికెట్ ఆడగలడని అంబటి రాయుడు చెప్పాడు. అతను టెస్ట్ క్రికెట్‌కు తిరిగి రావాలని, కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్తమ రెడ్-బాల్ కెప్టెన్ కోహ్లీ మాత్రమేనని, ఇప్పుడు అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే, ఓ గొప్ప ప్లేయర్ ను రిటైర్మెంట్ రూపంలో చాలా త్వరగా కోల్పోయామని అన్నాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత కోహ్లీ తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
-
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPl 2026: బంగ్లాదేశ్ యూటర్న్-ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
IPL ఫ్యాన్స్ కు బిగ్ షాక్ - మ్యాచులకు దూరంగా ధోనీ, CSK అధికారిక ప్రకటన..!! -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
IPL 2026: ఆర్సీబీ శుభారంభం.. సన్‌రైజర్స్‌కు ఘోర పరాజయం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications