నువ్వు టీమ్‌లో ఉండవ్..ఆ ప్లేయర్‌కు తేల్చి చెప్పిన రోహిత్ శర్మ..!
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలను సాధిస్తూ భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరగా, రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.
దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.టీమిండియా బలంగా కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లందరూ రాణిస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్, పాండ్యా, అక్షర్ పటేల్, రాహుల్, ఇలా ప్రధాన బ్యాట్స్‌మెన్లందరూ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే బౌలింగ్ విభానికి వస్తే.. షమీ అద్భుతంగా రాణిస్తుండగా, పాండ్యా అతనికి సహాకారం అందిస్తున్నాడు. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపిస్తున్నారు.అయితే ఒక్క ఆటగాడి మాత్రం జట్టుకు భారంగా మారాడు.అతనిపై మాత్రం జట్టు యాజమాన్యం అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.

ఆ ఆటగాడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్.ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే కుల్దీప్ యాదవ్ కంటే జడేజా, అక్షర్ పటేల్ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. పేసర్లను కాదని జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి సైతం తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కుల్దీప్ యాదవ్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఇదే సమయంలో అతని ఎకానమీ రేటు ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
దీంతో కీలక ఫైనల్ మ్యాచ్‌లో ముందు కుల్దీప్ యాదవ్ ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లతో చర్చించారు. దీనిలో భాగంగానే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్‌తో రోహిత్ శర్మకు మధ్య హాట్ డిబెట్ నడిచినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌లో స్నిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు.కుల్దీప్ యాదవ్‌తో మొహమాటం లేకుండా ముఖంపైనే నువ్వు టీమ్‌లో ఉండవ్ అని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్‌ను జట్టులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్:రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications