Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెంచరీ కొట్టాడని నితీష్ రెడ్డికి రూ.25 లక్షలిచ్చారు- సిల్వర్ మెడల్ సాధించిన జ్యోతికి ఏమిచ్చారు?

Jyoti Yerraji: జ్యోతి యర్రాజీ. ఉత్తరాంధ్రకు చెందిన అథ్లెట్. చైనా హాంగ్ఝౌలో గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలుగు తేజం. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా చాటారు. ఈ విభాగంలో రజత పతకాన్ని ముద్దాడిన విశాఖపట్నం అమ్మాయి. రాష్ట్రానికి పతకాన్ని అందించారు.

ఇప్పుడు మరోసారి మెరిశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ కోసం సిద్ధపడుతున్నారు జ్యోతి. దీనికోసం సన్నాహకాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్నారు.

Asian Games silver medalist Jyothi Yarraji rues lack of financial security

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌‌కు సన్నాహకమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భద్రత లేకపోవడం ఆమె పరుగుకు ప్రధాన హర్డిల్గా మారింది. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. తల్లి పేరు కుమారి. ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు.

వైజాగ్ పోర్ట్ హైస్కూల్ కృష్ణాలో చదువుకున్నారు జ్యోతి. అనంతరం ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బీఏ హిస్టరీ చేశారు. తొలిసారిగా 2015లో ఏపీలో నిర్వహించిన అంతర్‌ జిల్లా అథ్లెట్ మీట్‌‌లో బంగారు పతకాన్ని సాధించారు. అనంతరం హైదరాబాద్ సాయ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. హాంగ్ఝౌ ఆసియా గేమ్స్‌లో తలమానికంలా నిలిచారు.

రైల్వేలో గౌరవ వేతనం: రైల్వేలో పని చేస్తోన్నప్పటికీ- అక్కడ ఆమెకు అందే గౌరవ వేతనం తక్కువే. ప్రతి నెలా వేతనంగా 27,000 రూపాయల మొత్తాన్ని అందుకుంటోన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచీ ఎలాంటి ఆర్థిక సహకారం గానీ, ప్రోత్సాహం గానీ ఉండట్లేదు. ఓ మంచి ఉద్యోగమైనా ఇచ్చి ప్రోత్సహించాలనే ఆలోచన ప్రభుత్వానికీ లేకుండా పోయిందనే ఆవేదన.. జ్యోతి యర్రాజీ మాటల్లో వ్యక్తమౌతోంది.

38వ ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం, దాని ద్వారా అయిదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకోవడం అనేది జ్యోతి ప్రధాన లక్ష్యం. 60 మీటర్ల హర్డిల్స్ జాతీయ రికార్డును మెరుగుపరుచుకున్న అనంతరం తాజాగా ఆమె ఉత్తరాఖండ్ జాతీయ క్రీడలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మైఖెల్ స్పోర్ట్స్ పోర్టల్‌తో మాట్లాడారు. అవుట్‌డోర్ సీజన్‌ను చాలా త్వరగా ప్రారంభిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమించాల్సిన వచ్చిందని అన్నారు. జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం అయిదు లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తుందని అన్నారు. ఈ నగదు పురస్కారం తన తల్లిదండ్రులకు కొంత వరకు అండగా నిలుస్తుందని చెప్పారు.

భవిష్యత్తులో మరో రాష్ట్రం నుంచి: ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన చెందుతున్నానని జ్యోతి యర్రాజీ స్పష్టం చేశారు. తనలాంటి అథ్లెట్‌కు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన విధానం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఆర్థిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఉద్యోగం ఇస్తుందని ఆశించానని, ఇప్పటివరకు అది సాధ్యపడలేదని చెప్పారు.

భవిష్యత్తులో మరో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని ఆలోచిస్తోన్నానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయని, ఒలింపియన్, ఆసియా క్రీడల పతక విజేతకు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచినప్పటికీ తనకు ఎలాంటి పదోన్నతి కూడా దక్కలేదని వాపోయారు. కొద్దో గొప్పో సమానత్వాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల యూరప్‌లో తన ప్రదర్శన గురించి మాట్లాడారు జ్యోతి. 60 మీటర్ల హర్డిల్స్‌‌ను 8.04 సెకన్లలో పూర్తిచేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నారు. తన జాతీయ రికార్డు 12.78 సెకన్లను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నానని చెప్పారు.

నితీష్‌కు క్యాష్ ప్రైజ్: విశాఖపట్నానికే చెందిన నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల రూపాయలను ఇచ్చి గౌరవించింది చంద్రబాబు ప్రభుత్వం. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు నితీష్. అందుకే అతనికి నగదు బహుమతిని ఇచ్చింది. ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పించింది.

అదే సమయంలో అదే విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీ- అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించినప్పటికీ కనీస ప్రోత్సాహం దక్కకపోవడం బాధాకరమే. నితీష్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం గౌరవించడాన్ని ఎవరూ తప్పుపట్టారు. ఆ అవసరం కూడా ఎవరికీ రాదు. అదే స్థాయిలో దేశం, రాష్ట్ర గౌరవాన్ని పెంచిన జ్యోతిని ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+