IPL final 2024: కావ్య టీం ఫైనల్ గెలుస్తుందా - తేల్చేసిన వేణుస్వామి..!!
Final IPL Match 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. టైటిల్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈసారి కప్ గెలిచి ముద్దాడాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. హైవోల్ట్‌జ్ మ్యాచ్ కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. జ్యోతిష్కులు వేణుస్వామి ఈ మ్యాచ్ విన్నర్ పైన తన అంచనాలను వెల్లడించారు.
ఫైనల్ కు సిద్దం
ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌కి ఎండ్ కార్డు పడనుంది. ఈసీజన్ లో తొలి నుంచి అంచనాలకు మించి రాణిస్తున్న ఈ రెండు జట్లు తుది పోరులో తమ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. టీం ఆక్షన్ సమయంలోనే జట్టు సభ్యుల ఎంపికలో కావ్య నిర్ణయాలపై పోటీ దారులైన ప్రాంఛైజీలు సైతం నవ్వుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కానీ, కావ్య అంచనాలను తగినట్లుగా టీం సక్సెస్ ఫుల్ గా రాణించింది. తొలి ప్లే ఆఫ్ లో ఓడినా..ఎలిమినేటర్ మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకొని ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇక, ఈ మ్యాచ్ పైన భిన్నమైన అంచనాలు ఉన్నాయి. గెలుపు పైన రెండు జట్ల పైన ఎవరి అంచనాలు వారు వెల్లడిస్తున్నారు.
వేణుస్వామి అంచనాలు
ఇదే ఫైనల్ మ్యాచ్ పై జ్యోతిష్కులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ జ్యోతిష్కుడు అయిన వేణుస్వామి తన అంచనాలు వెల్లడించారు. కావ్య మారన్ జాతకంలో దోషం ఉన్నంత కాలం సన్ రైజర్స్ జట్ట డిజాస్టర్ లో ఉందని చెప్పుకొచ్చారు. లిస్టులో లేనటువంటి జట్టుగా గుర్తు చేసారు.
కావ్య జాతకంలో మిథున రాశి జాతకం కలిసి వస్తుందని..యోగం మారిందని విశ్లేషించారు. దీంతో..టీంకు కలిసి రావటంతో... మంచి టీంల పైన గెలిచిందని వివరించారు. సన్ రైజర్స్ టీంకు కలిసి వస్తుందని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐపీఎల్ ఫైనల్ వేళ వేణుస్వామి అంచనాలు వైరల్ అవుతున్నాయి.

కలిసొచ్చేదెవరికి
ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టును విదేశీ కెప్టెన్లే నాలుగు సార్లు ఫైనల్‌కు చేర్చారు. అందులో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం.2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్ గెలిచారు. ఈసారి పాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్‌కి చేరారు. కోల్‌కతా - హైదరాబాద్ ఇప్పటి వరకు 27సార్లు తలపడగా.. కేకేఆర్ 18, ఎస్‌ఆర్‌హెచ్ 9 మ్యాచుల్లో గెలిచాయి. అయితే ఈసారి కేకేఆర్ ఫైనల్‌కి చేరడంలో గంభీర్ పాత్ర కూడా ఉంది.
ఇప్పటికే ఇరుజట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నైలో సందడి చేశారు. చెన్నై బీచ్ లో, ఇతర ప్రాంతాల్లో కప్ తో మరింత ఆసక్తి పెంచారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. రిజర్వ్‌డే ఉంది. అప్పుడూ కూడా జరగకపోతే మాత్రం కోల్‌కతా విజేతగా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే కోల్‌కతాకే ఎక్కువ పాయింట్లు ఉండటం వల్ల కేకేఆర్‌కి కలిసి రానుంది.












Click it and Unblock the Notifications