ఆస్ట్రేలియాకు చావు దెబ్బ- వరల్డ్ కప్ రేసు నుంచి అవుట్?

టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం. మొన్నటికి మొన్న జింబాబ్వే చేతిలో మట్టికరిచిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు శ్రీలంక చేతిలో చావుదెబ్బ తిన్నది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా దాదాపుగా టీ20 వరల్డ్ కప్ రేసు నుంచి వైదొలగినట్టే. అదే సమయంలో శ్రీలంక సూపర్ 8 దశకు చేరింది. అర్హత సాధించింది. ఆస్ట్రేలియా సూపర్ 8 ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్ ప్రయాణం ముగిసినట్లే.

పాథుమ్ నిశ్శంక ఈ మ్యాచ్ లో తడాఖా చూపాడు. 52 బంతుల్లో సెంచరీ ఊదిపడేశాడు. నాటౌట్ గా నిలిచాడు. ఈ20 వరల్డ్ కప్ లో ఇదే తొలి సెంచరీ. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా 182 పరుగులను నిర్దేశించింది. శ్రీలంక దీనిని 18 ఓవర్లలోనే అందుకుంది. సంచలనం సృష్టించింది. అంతకుముందు జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి వారి సూపర్ 8 అవకాశాలకు అడ్డంకిగా మారింది.

Australia Crushed by the Sri Lanka as Dominate with Pathum Nissanka Unbeaten ton 8-Wicket Victory

ప్రారంభంలో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే కుశాల్ పెరీరా అవుట్ అయ్యాడు. అతను చేసింది ఒక పరుగే. అతని స్థానంలో వచ్చిన కుశాల్ మెండిస్ తో కలిసి నిశ్శంక చెలరేగాడు. సెంచరీ పార్ట్ నర్ షిప్ ను అందించాడు. 38 బంతుల్లో 51 పరుగులు చేసిన మెండిస్ 13వ ఓవర్‌లో జట్టు స్కోరు 105 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. పాథుమ్ నిశ్శంక పాతుకుపోయాడు. అజేయ శతకంతో శ్రీలంకకు విజయం అందించాడు. నిస్సాంక ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్‌లు ఉన్నాయి.

ఆస్ట్రేలియాకు శుభారంభమే లభించింది గానీ దాన్ని మరింత భారీ స్కోర్ గా మలచలేకపోయింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లు తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 9వ ఓవర్‌లో 104 పరుగుల వద్ద తొలి వికెట్ పడినప్పటికీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస వికెట్లు కోల్పోయి తడబడింది, వారి పతనం అక్కడే మొదలైంది. 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్ మార్ష్ 54, ట్రావిస్ హెడ్ 56 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ విఫలమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+