స్వదేశంలో టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే..! బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన..!

గత కొంతకాలంగా టీ20 వరల్డ్ కప్ తో పాటు స్వదేశంలో వరుస సిరీస్ లతో బిజీగా గడిపిన టీమిండియా ఈ ఏడాది కూడా బిజీ షెడ్యూల్ తోనే గడపబోతోంది. ఈ మేరకు ఈ ఏడాది టీమిండియా వచ్చే సీజన్ లో ఆడే సిరీస్ ల షెడ్యూల్ ను ఇవాళ బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. ఇందులో స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేతో ఆడే సిరీస్ లతో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కూడా ఉన్నాయి. దీంతో మరో బిజీ సీజన్ కు టీమిండియా క్రికెటర్లు సిద్దం కావాల్సి ఉంది.

ఇందులో ముందుగా భారత్ లో వెస్టిండీస్ పర్యటన ఉంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. సెప్టెంబర్ 27న తిరువనంతపురం, సెప్టెంబర్ 30న గౌహతి, అక్టోబర్ 3న న్యూ చండీఘడ్ లో వన్డే మ్యాచ్ లు ఉంటాయి. అలాగే అక్టోబర్ 6,9, 11, 14,17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో టీ20 మ్యాచ్ లు ఉంటాయి. అనంతరం శ్రీలంక భారత్ కు వస్తుంది. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి.

BCCI Confirms Home Series Against West Indies Sri Lanka Zimbabwe and Border-Gavaskar Trophy

డిసెంబర్ 13న ఢిల్లీలో తొలి వన్డేతో శ్రీలంక సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం 16న బెంగళూరులో, 19న అహ్మదాబాద్ లో రెండు,మూడు వన్డేలుంటాయి. ఇవి ముగిశాక 22, 24, 27 తేదీల్లో రాజ్ కోట్, కటక్, పూణేలో మూడు టీ20 మ్యాచ్ లు ఉంటాయి. అనంతరం జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. కోల్ కతాలో జనవరి 3న తొలి వన్డే ఉంటుంది. తర్వాత హైదరాబాద్ లో జనవరి 6న, ముంబైలో జనవరి 9న రెండు, మూడు వన్డేలు ఉంటాయి. ఇవి ముగియగానే ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. జనవరి 21న నాగ్ పూర్ లో తొలిటెస్టు, 29న చెన్నైలో రెండో టెస్టు, ఫిబ్రవరి 11న గౌహతిలో మూడో టెస్టు, ఫిబ్రవరి 19న రాంచీలో నాలుగో టెస్టు, ఫిబ్రవరి 27న అహ్మదాబాద్ లో ఐదో టెస్టు ప్రారంభమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+