ట్విస్టుల మీద ట్విస్టులు- పాకిస్తాన్ తో మ్యాచ్ పై తేల్చేసిన బీసీసీఐ

టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ కో హోస్ట్ శ్రీలంక సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది గానీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు. పట్టిన పట్టు వీడట్లేదు. భారత్ తో ఆడదలచుకోలేదంటూ స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫే ప్రకటించారంటే- దీన్ని ఆ దేశం ఎంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

దీనిపై తాజాగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ అంశాన్ని ఐసీసీకి వదిలేసినట్లు తెలిపారు. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాలనే తామంతా కోరుకుంటోన్నామని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం తమ పరిధిలో లేదని, అంతా ఐసీసీ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

BCCI Keeps Faith with ICC We ll Follow the Global Body s Decision on India-Pakistan Clash on Feb 15

ఈ విషయంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటిస్తామని రాజీవ్ శుక్లా పునరుద్ఘాటించారు. ఈ సున్నితమైన విషయంలో టోర్నమెంట్ నిర్వాహకులకు బీసీసీఐ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ నెల 15వ తేదీన భారత్- పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇది. దీన్ని ఆడబోమని పాకిస్తాన్ ఇదివరకే ప్రకటించింది. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిళలు తీసుకొస్తోంది శ్రీలంక క్రికెట్ బోర్డ్.

అంతకుముందు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాకిస్థాన్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌లో ఇలాంటి నిర్ణయం అసాధారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ నుండి ఎందుకు వైదొలుగుతున్నారని, శ్రీలంకలో భారత్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ కు వచ్చిన ఇబ్బందేమిటని అడిగారు. పాకిస్తాన్ వెనక్కి తగ్గడం తనను ఆశ్చర్యపరిచిందని, ప్రపంచ కప్‌లో ప్రతి పాయింట్ ముఖ్యమైనదని న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు.

ఇదిలా ఉండగా, భారత జట్టు ప్రస్తుతం తమ మ్యాచ్‌లపైనే పూర్తి దృష్టి సారించింది. తర్వాతి మ్యాచ్‌కు ముందు, ప్రధాన కోచ్ గంభీర్ ఆదివారం సాయంత్రం జాతీయ రాజధానిలోని తన నివాసంలో జట్టుకు విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు. ఈ విందు ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగే భారత్ మ్యాచ్‌కు ముందు జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+