ధోనీ అన్నకు టీమిండియాలో కొత్త రోల్- పాము, ముంగీస ఒకేచోట ఉంటాయేంట్రా

వచ్చే ఏడాది ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ ఈవెంట్ ను నిర్వహించబోతోన్నాయి. ఈ రెండు దేశాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ ఫార్మట్ లో ప్రస్తుత ఛాంపియన్ మనమే. గత ఏడాది జూన్ లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగల తేడాతో మట్టికరిపించింది భారత్. జయకేతనాన్ని ఎగురవేసింది. దీంతో పాటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

ఇప్పుడిక 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి ఏడాది కూడా గడువు లేదు. ఇంకో అయిదు నెలల్లో ఈ టోర్నమెంట్ మొదలవుతుంది. సెప్టెంబర్ 9న ఆరంభం కానున్న ఆసియా కప్ తర్వాత.. టీమిండియా ఆడబోయే మేజర్ టోర్నమెంట్ ఇదే కాబోతోంది. ఈ సారి కూడా ఛాంపియన్ గా నిలవాలనే పట్టుదలతో ఉంది బీసీసీఐ. ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలను తీసుకుంటోంది.

BCCI reportedly offers mentor role to MS Dhoni for Team India ahead of T20 World Cup 2026

ఇందులో భాగంగా- భారత జట్టు మెంటార్‌గా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ధోనీతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మెంటార్ గా కొత్త రోల్ ను పోషించాలనే ప్రతిపాదనలను ఆయనకు పంపించింది. దీనిపై ధోనీ తన తుది నిర్ణయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ధోనీ మెంటార్ గా జట్టులో అడుగు పెడితే- పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం మీద కూడా బీసీసీఐ ఆరా తీస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తోన్నాడు. అతనితో కలిసి ధోనీ మనస్ఫూర్తిగా పని చేయగలడా?, ధోనీ- గంభీర్ లీడర్షిప్ వర్కవుట్ అవుతుందా? కాదా అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి బీసీసీఐ వద్ద కూడా దీనికి ఎటువంటి సమాధానం ఉండకపోవచ్చు.

ధోని 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ మెంటార్‌గా వ్యవహరించాడు. అది విఫల ప్రయోగం అయింది. అప్పుడు భారత్ నాకౌట్ దశకు కూడా చేరుకోలేకపోయింది. ధోని వ్యూహాత్మక ఆలోచనలు, ప్రశాంతమైన నాయకత్వం, అధిక ఒత్తిడి గల టోర్నమెంట్‌లలో ఆయన అనుభవం.. జట్టు వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవడానికి కీలకమని బోర్డు నమ్ముతోంది.

ఈ ఆఫర్‌ను ధోని అంగీకరించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం దీనికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. టీమ్ లో ఇద్దరూ సుదీర్ఘకాలం పాటు కొనసాగినప్పటికీ- ప్రొఫెషన్ పరంగా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటిగా లేని సందర్భంగా ఉన్నాయి. ఈ కారణం వల్ల ధోని మెంటార్ పదవిని స్వీకరించడానికి వెనుకాడొచ్చని భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+