Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ తో మ్యాచ్ కు అభిషేక్ దూరం: తేల్చేసిన సూర్యకుమార్ యాదవ్

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గా నమీబియాతో తలపడుతోంది.. టీమిండియా. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగింది. మెరుపువేగంతో ఇన్నింగ్ ఆరంభించింది గానీ.. వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సంజు శాంసన్ ఎక్కువసేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. ఎనిమిది బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాదిన సంజు.. ఆ వెంటనే అవుట్ అయ్యాడు. షికాంగో బౌలంగ్ లో స్టీన్ క్యాంప్ కు క్యాచ్ అచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నారు.

ఈ మ్యాచ్ కు అభిషేక్ శర్మ అందుబాటులో లేడు. కడుపు సంబంధిత ఇన్ ఫెక్షన్ తో ఇబ్బంది పడ్డ ఈ డాషింగ్ ఓపెనర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు గానీ.. ఫిట్ నెట్ లో లేడు. దీంతో ఈ మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇది- ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. అత్యంత కీలకం, అంతకుమించి ప్రతిష్ఠాత్మకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ నాటికి కూడా అభిషేక్ శర్మ రికవరీ అవుతాడే గ్యారంటీ లేదు. ఆడేది అనుమానమే.

Captain Suryakumar Yadav Indicates Abhishek Sharma Won t Play Against Pakistan in T20 World Cup

ఈ విషయాన్ని స్వయంగా కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. టాస్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. అభిషేక్ శర్మ ఫిట్ నెస్ సాధించలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో లేడని తేల్చి చెప్పాడు. అందుకే అతని స్థానంలో సంజు శాంసన్ ను తుదిజట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. ఇంకో ఒకట్రెండు మ్యాచ్ లల్లో అతను ఆడటకపోవచ్చని స్పష్టం చేశాడు. ఫిట్ నెస్ విషయం నిజంగా తెలియదని వ్యాఖ్యానించాడు.

అభిషేక్ స్థానంలో సంజు శాంసన్‌ను జట్టులోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తో కలిసి ఇన్నింగ్ ఆరంభించాడు. అంచనాలకు తగ్గట్టే మెరుపు బ్యాటింగ్ చేశాడు గానీ.. క్రీజ్ లో కుదురుకోలేకపోయాడు. నిలకడలేమి అతన్ని వేధిస్తోంది. ఫామ్ ను అందిపుచ్చుకోలేక సతమతమౌతున్నాడు. అభిషేక్ శర్మకు బదులుగా సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తాడని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ఇది అతనికి గొప్ప అవకాశమని, పాకిస్తాన్ మ్యాచ్‌కు సిద్ధపడాలనీ పేర్కొన్నాడు.

నమీబియాపై ఆడుతున్న టీమిండియా తుదిజట్టులో- సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కేప్టెన్), వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+