వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ లోకి క్రికెట్ ! ఐఓసీ కీలక నిర్ణయం- 2028లో టీ20 ఫార్మాట్లో..
ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆటలతో పోటీగా ప్రేక్షకాదరణ పెంచుకుంటున్న క్రికెట్ ను తిరిగి ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టాలని ఇవాళ ముంబైలో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దాదాపు వందేళ్లకు పైగా విరామం తర్వాత తిరిగి ఒలింపిక్స్ లో దీనికి చోటు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఉన్న నీతా అంబానీ స్వాగతించారు.
2028లో లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో జరగబోయే ఒలింపిక్స్ లో తిరిగి క్రికెట్ కు చోటు కల్పించాలని ఐఓసీ నిర్ణయం తీసుకుంది. గతంలో 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో చివరి సారిగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. అప్పట్లో కేవలం రెండు జట్లకు మాత్రం ఆడే అవకాశం దక్కింది. ఇందులో పారిస్ తో పాటు గ్రేట్ బ్రిటన్ ఉన్నాయి. ఈ రెండు జట్లూ రెండు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ ఆడాయి. చెరోవైపు 12 మంది ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్ లో బ్రిటన్ విజయం సాధించింది.

ఇప్పుడు 2028లో అంటే దాదాపు 128 ఏళ్లకు తిరిగి ఒలింపిక్స్ లో క్రికెట్ చోటు దక్కించుకుంది. క్రికెట్ తో పాటు స్క్వాష్ కు కూడా ఐదేళ్ల విరామం తర్వాత 2028 ఒలింపిక్స్ కు చోటు కల్పించారు. ముంబైలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో ఓటింగ్ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో రెండు క్రీడల చేరికలు అధికారికంగా చేరాయి. LA 2028 ప్రోగ్రామ్‌లో లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్,బేస్ బాల్/సాఫ్ట్‌బాల్‌లతో పాటు క్రికెట్ ,స్క్వాష్‌లు చేర్చారు.ఇద్దరు IOC సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇవాళ జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కార్యనిర్వాహక బోర్డు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేందుకు సిఫార్సు చేసింది. అలాగే ఈసారి ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. కేవలం ఆరు జట్లకు మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ ఆరు జట్లను ర్యాంకింగ్స్, అర్హత పోటీల ఆధారంగా నిర్ణయిస్తారు. అమెరికాలో ఈ క్రీడలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశానికి నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది.












Click it and Unblock the Notifications