Shikhar Dhawan: శిఖర్ ధావన్ ఎమోషనల్ డెసిషన్ - గుడ్ బై..!!
టీమిండియా క్రికెట్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శిఖర్ ధావన్ ఎమోషనల్ ప్రకటన చేసారు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటుగా దేశవాళీ మ్యాచ్ లకు దూరం అవుతున్నట్లు తేల్చి చెప్పారు. క్రికెట్ కెరీర్ తో పాటుగా వ్యక్తిగత జీవితంలోనూ శిఖర్ ధావన్ అనేక సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కొంత కాలంగా శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది.
శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ గా మారింది.టీమిండియా ఓపెనర్ గా..ఐపీఎల్ లో పంజాబ్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రతీ ఐసీసీ టోర్నమెంట్ లో శిఖర్ ధావన్ ముద్ర ఉంది. కొంత కాలంగా శిఖర్ ధావన్ కు టీం సెలక్షన్ లో తగిన ప్రాధాన్యత లభించటం లేదు. ఫాం విషయంలోనూ శిఖర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయసు పెరుగుతుండటంతో శిఖర్ ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు శిఖర్ ధావన్ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ ల చర్చ మొదలైంది.

తన రిటైర్మెంట్ ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని...వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని శిఖర్ ధావన్ తెలిపారు. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తనకు భవిష్యత్ అవకాశాల పైన నమ్మకం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ తన కెరీర్ లో 167 వన్డేలుఆడి 6793 పరుగులు చేసాడు. అదే విధంగా 68 టీ 20లు ఆడిన శిఖర్ 1759 పరుగులు చేసాడు. 34 టెస్టులు ఆడి 2315 పరుగులు చేసిన శిఖర్ ఇక అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024












Click it and Unblock the Notifications