Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధోనీకి చీవాట్లు పెట్టిన స్టార్ హీరో- అవి గానీ వింటే?

Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో ఘోర ఓటమిని చవి చూసింది. కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో అవమానకరంగా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో సీఎస్‌కే.. గెలిచింది ఒక్కటే. చివరి అయిదింట్లోనూ చేతులెత్తేసింది. ఇక ముందు గెలుస్తుందనే అంచనాలు కూడా లేవీ జట్టుపై.

చెన్నై చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కోల్‌కత నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.

CSK vs KKR Why come so lower down the order Vishnu Vishal takes a dig at MS Dhoni in IPL 2025

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత అలవోకగా ఈ స్వల్ప స్కోర్‌ను అధిగమించింది. 10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఎగబాకింది కేకేఆర్. స్కోరు స్వల్పమే అయినప్పటికీ- కేకేఆర్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు.

క్వింటన్ డికాక్ 16 బంతుల్లోనే 23, సునీల్ నరైన్ 18 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనంతరం రహానే- 20, రింకూ సింగ్- 15 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగలిగారు.

CSK vs KKR Why come so lower down the order Vishnu Vishal takes a dig at MS Dhoni in IPL 2025

సీఎస్కే పేలవంగా ఆడిందీ మ్యాచ్‌లో. అటు బ్యాటింగ్‌లో గానీ ఇటు బౌలింగ్‌లో గానీ ఏ మాత్రం కూడా స్థాయి తగ్గ ఆటతీరును కనపర్చలేకపోయింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. అనంతరం విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.

విజయ్ శంకర్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 16 పరుగులు చేశాడు. శివం దూబే ఒంటరి పోరాటం చేశాడు గానీ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించలేకపోయాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్. కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో సహా ఆరు మంది బ్యాటర్లు ఆరు పరుగులు మాత్రమే జోడించారు.

ఈ ఓటమి అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరుపై హీరో విష్ణు విశాల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇండైరెక్ట్‌గా ధోనీపై విరుచుకుపడ్డాడు. ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను చూసిన తరువాత క్రికెటర్ కావాలనుకునే తన ప్రయత్నాలను మానుకున్నానంటూ తేల్చి చెప్పాడు. ఇలా వరుసబెట్టి మ్యాచ్‌లను ఓడిపోవడం అత్యంత దారుణమంటూ వ్యాఖ్యానించాడు.

లోయర్ ఆర్డర్‌లో ధోనీ బ్యాటింగ్‌కు రావడాన్నితప్పు పట్టాడు విష్ణు విశాల్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకంటూ నిలదీశాడు. ఓడిపోవడామనికి ఎవ్వరైనా మ్యాచ్‌లు ఆడతారా? అంటూ ఎద్దేవా చేశాడు. ఈ మ్యాచ్- ఓ సర్కస్‌ను చూసినట్టుగా ఉందని చురకలు అంటించాడు. స్పోర్ట్స్ కంటే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదని చెప్పాడు. ఈ మేరకు మ్యాచ్ ముగిసిన తరువాత ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+