భారత్ చేతిలో అమెరికా ఓటమి.. ట్రంప్ రియాక్షన్ ఇదే!

T20 World Cup 2026: భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆడుతున్న తమ దేశ జట్టుకు మద్దతుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంపారు. క్రికెట్ పట్ల అమెరికాలో పెరుగుతున్న ఆసక్తికి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ నిదర్శనంగా నిలిచింది.

బలమైన జట్టు.. విజయం సాధించారు: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశంలో అమెరికా జట్టును ఉత్సాహపరిచారు. "ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోందని నాకు ఇప్పుడే తెలిసింది. అమెరికా జట్టు ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. మనది చాలా బలమైన జట్టు. మీరు విజయాలు సాధించాలని అమెరికా దేశం మొత్తం ఆకాంక్షిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ పెద్దగా ప్రాచుర్యం లేని అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే స్పందించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Donald Trump Reacts After India Beats USA in T20 World Cup 2026 Sends Special Message to Team USA

భారత్ చేతిలో అమెరికాకు తప్పని ఓటమి
నిజానికి ట్రంప్ ఈ సందేశాన్ని పంపే సమయానికే శనివారం రాత్రి భారత్, అమెరికా జట్ల మధ్య కీలక మ్యాచ్ ముగిసింది. ముంబయి వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా జట్టు గట్టిగానే పోరాడింది. అయితే భారత బౌలర్ల ధాటికి తలొగ్గిన అమెరికా 29 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌తో ఆతిథ్య భారత్ టోర్నీలో శుభారంభం చేసింది.

రాయబారి స్పందన
డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ పోస్ట్‌పై భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తక్షణమే స్పందించారు. "మీ మద్దతుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్" అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. అమెరికాలో క్రికెట్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో, అగ్రరాజ్య అధినేత నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహం ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ట్రంప్ వంటి కీలక నేతల మద్దతు ఉండటం అమెరికా జట్టుకు సానుకూల అంశం. రాబోయే మ్యాచ్‌ల్లో అమెరికా జట్టు పుంజుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు, సొంతగడ్డపై భారత్ చూపిస్తున్న దూకుడు అభిమానులను అలరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+