Shami: బాధ కలిగింది, అవకాశం కోసం చూసా - షమీ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

ప్రపంచ కప్ సెమీస్ హీరో మహ్మద్ షమీ. ఈ మ్యాచ్ లో షమీ ఏడు వికెట్లు తీసాడు. న్యూజీలాండ్ ఒక దశలో విజయానికి చేరువ అవుతుందనే విధంగా మిచెల్..విలియ్సన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ మరోసారి షమీ పైన నమ్మకంతో బౌలింగ్ కు తీసుకొచ్చాడు. అంతే, అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. సెమీస్ లో న్యూజీలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన షమీ..తన బౌలింగ్ .. ఏం జరిగిందనే దాని పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు.

లక్ష్యం మేరకే
న్యూజీలాండ్ తో జరిగిన సెమీస్ లో భారత్ నిర్దేశించిన లక్ష్యం చేధించేందుకు బరిలోకి కివీస్ బ్యాటర్లను షమీ ముప్ప తిప్పలు పెట్టాడు. రెండు వికెట్లను తీసి ఆదిలోనే దెబ్బ కొట్టాడు. కానీ, ఇదే మ్యాచ్ లో షమీ వదిలేసిన క్యాచ్ తో ఒక్కసారిగా వాంఖడే స్టేడియంలో ఒక్కసారిగా మౌనం రాజ్యమేలింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ ను గట్టెక్కించే బాధ్యత కెప్టెన్ విలియమ్సన్..మిచిల్ తీసుకున్నారు. రెండు వికెట్లు తీసిన షమీ కీలకమైన విలియమ్సన్ క్యాచ్ డ్రాప్ చేయటంతో ఫ్యాన్స్ బాధ పడ్డారు. కానీ, ఆ తరువాత సెకండ్ స్పెల్ లో అయిదు వికెట్లు తీసిన షమీ..న్యూజీలాండ్ బాటర్లు ఎక్కుడా కోలుకోకుండా చేసి విజయానికి బాట వేసాడు. క్యాచ్ వదిలేసిన షమీ కొద్దిసేపు ఫ్యాన్స్ కు విలన్ లాగా కనిపించాడు. కానీ, కాసేపటికే హీరోలా మారిపోయాడు.

Feeling amazing: Mohammed Shami Reacts after producing a seven-wicket match-winning haul against NZ

అప్పుడు బాధ కలిగింది
ఈ క్యాచ్ డ్రాప్ పైన షమీ స్పందించాడు. ప్రపంచ కప్ ముందు తాను పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఎక్కువగా ఆడలేదని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. అందరూ యార్కర్లు, స్లో బంతుల గురించే మాట్లాడుతూ ఉంటారని..తాను కొత్త బంతితోనూ వికెట్లు తీయటానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్ధి టీం పైన ఒత్తిడి పెరుగుతుందన్నాడు. విలియమ్సన్ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు బాధ కలిగిందన్నాడు. దీంతో బౌలింగ్ కోసం ఎదురు చూసానని వివరించాడు. ఆ సమయంలో కివీస్ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడుతున్నారని.. అదే సమయంలో పిచ్ లో తేమ వస్తుందేమోనని కంగారుపడ్డామని చెప్పుకొచ్చాడు.

Feeling amazing: Mohammed Shami Reacts after producing a seven-wicket match-winning haul against NZ

నమ్మకం నిలబెట్టుకోవాలని
తనకు రోహిత్ బౌలింగ్ ఇవ్వగానే ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేసానని చెప్పాడు.పిచ్ కూడా చాలా బాగుందని విశ్లేషించాడు. బంతి లైన్ తప్పకుండా బౌలింగ్ చేసానని చెప్పాడు. స్లో బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చాని..తాను నమ్మిన విధంగా బౌలింగ్ చేయటంతో వికెట్లు దక్కాయని విశ్లేషించాడు. 2015, 2019 లో సెమీస్ లో ఓటమి చవిచూశామని చెప్పిన షమీ..ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకూడదనే బలమైన నిర్ణయంతో సమిష్టిగా ఆడామని చెప్పుకొచ్చాడు. సెమీస్ లో ఏడు వికెట్లు తీసిన షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక, ఇప్పుడు ఫ్యాన్స్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+