హార్ధిక్ పాండ్యాకు గంభీర్, అగార్కర్ కలిసే షాకిచ్చారా ? సంచలన రిపోర్ట్..!
శ్రీలంకలో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు కెప్టెన్ గా అందరి అంచనాలకు భిన్నంగా హార్ధిక్ పాండ్యాను కాదని సూర్య కుమార్ యాదవ్ కు సెలక్టర్లు ఎంపిక చేశారు. దీనిపై అభిమానుల్లో తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాజాగా టీ 20 వరల్డ్ కప్ లో సత్తా చాటుకున్న హార్ధిక్ పాండ్యాకు రోహిత్ శర్మ వారసుడిగా అవకాశం దక్కుతుందని ఏకంగా బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా తేల్చేసిన తర్వాత కూడా ఇలా మొండిచేయి చూపడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తెరవెనుక ఏం జరిగిందనే దానిపై తాజాగా మరో నివేదిక బయటికి వచ్చింది.
హార్ధిక్ పాండ్యాను శ్రీలంకకు వెళ్లే టీ20 జట్టు కెప్టెన్ గా లేదా కనీసం వైస్ కెప్టెన్ గా కూడా నియమించకపోవడం వెనుక జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్ హస్తం ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమస్యంలో గంభీర్ తో పాటు ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నాడనే నివేదిక వచ్చింది. ఇందులో గంభీర్, అగార్కర్ ఇద్దరూ కలిసే హార్ధిక్ పాండ్యాను టీ20 టోర్నీ నుంచి పక్కనబెట్టేసినట్లు అర్ధమవుతోంది.

హార్ధిక్ పాండ్యాను టీ20 కెప్టెన్ గా ఎంపిక చేయకపోవడం వెనుక అతని ఫిట్ నెస్ తో పాటు అంతర్జాతీయ జట్టు కెప్టెన్ స్ధాయిలో వ్యూహాలు లేకపోవడమే ప్రధాన కారణంగా సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. హార్ధిక్ ఎదుర్కొంటున్న ఫిట్ నెస్ సమస్యలు, నిలకడలేమి, వ్యూహాల్లో వైఫల్యం వంటి కారణాలతో గంభీర్, అగార్కర్ మాట్లాడుకుని హార్ధిక్ కు పక్కనబెట్టేసినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. అలాగే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా పాండ్యా కంటే సూర్య కుమార్ యాదవ్ కే ప్లేయర్ల మద్దతు ఉందనేది మరో ప్రచారం. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలంటే హార్ధిక్ పాండ్యా తప్పకుండా డిసెంబర్‌లో బరోడా తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications