నువ్వు టీమ్‌లో ఉండవ్‌..ఆ ప్లేయర్‌కు తేల్చి చెప్పిన గౌతమ్‌ గంభీర్‌..!

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. షమీ బౌలింగ్‌లో అదరగొట్టగా, బ్యాటింగ్‌లో గిల్ సెంచరీతో రాణించాడు.అయితే భారత జట్టు స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయిందనే విమర్శలు వినిపించాయి. 100 పరుగులకే అలౌట్ చేయాల్సిన బంగ్లాదేశ్‌ను 200లకు పైగా పరుగులు చేయించడంపై విమర్శలు వెలువెత్తాయి.

షమీ మినహా మిగిలిన బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో కోచ్ గంభీర్ జట్టు ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో జట్టు కూర్పుపై గంభీర్ ఆటగాళ్లతో చర్చించారు. దీనిలో భాగంగానే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్‌ ప్లేయర్‌తో హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు మధ్య హాట్‌ డిబెట్ నడిచినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో ఆడే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్నిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు.కుల్దీప్ యాదవ్‌తో మొహమాటం లేకుండా ముఖంపైనే నువ్వు టీమ్‌లో ఉండవ్‌ అని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

Gautam Gambhir is considering replacing Kuldeep Yadav with Varun Chakravarthy

కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే యోచనలో గౌతమ్‌ గంభీర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. పైగా బంగ్లాదేశ్‌తో జరిగిన మైదానంలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్ కూడా జరుగనుంది. దీంతో కుల్దీప్ యాదవ్‌‌ను పక్కన పెట్టి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. అలాగే హర్షిత్ రాణా స్థానంలో అర్షదీప్‌ సింగ్‌కు జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్షదీప్‌ సింగ్‌, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+