Gautam Gambhir: రాజకీయాలకు బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ గుడ్ బై ! ఐపీఎల్ కోసం కీలక నిర్ణయం..
తూర్పు ఢిల్లీ సీటు నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు.
త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ లో కమిట్ మెంట్లు ఉన్నందున తనకు రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతం గంభీర్ కోరాడు. దీంతో ఈసారి బీజేపీ ఎంపీ టికెట్ ను మరొకరికి కేటాయించనున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీ సీటు నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంభీర్ ఆ తర్వాత ఎక్కువగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు. మరోవైపు రాజకీయాల కారణంగా క్రికెట్ కమిట్మెంట్ల విషయంలోనూ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఐపీఎల్ కమిట్మెంట్లు చూసుకోవాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం లేకపోవడం వల్లే గంభీర్ గుడ్ బై చెప్తున్నట్లు కూడా సమాచారం.
"నేను రాబోయే క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెట్టడానికి నన్ను నా రాజకీయ బాధ్యతల నుండి విముక్తి చేయమని గౌరవనీయ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా జీని అభ్యర్థించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్" అంటూ ఎక్స్ లో గంభీర్ పేర్కొన్నాడు. దీంతో గంభీర్ బీజేపీకి నేరుగా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఈసారి ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ హోదాలో గౌతం గంభీర్ కనిపించనున్నాడు. గతంలోనూ లక్నో జెయింట్స్ తో పాటు పలు జట్లకు ఆటగాడిగా, మెంటార్ సహా వివిధ హోదాల్లో గంభీర్ పనిచేశాడు. క్రికెట్ వర్గాల్లో గంభీర్ కు మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. దీంతో తిరిగి ఐపీఎల్ పై దృష్టిసారించేందుకు గంభీర్ సిద్దమవుతున్నాడు.












Click it and Unblock the Notifications