IND vs Eng: ఇంగ్లండ్ పై భారత్ కు ఎడ్జ్ వీరిద్దరే-గవాస్కర్ తాజా లెక్క..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో భాగంగా రేపు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ (south africa vs new zealand) తలపడతాయి. అనంతరం ఎల్లుండి జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ (india vs england) తలపడబోతున్నాయి. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆయా జట్ల బలాబలాలు, ఇతర అంచనాల ఆధారంగా చూస్తే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఇందులో ఎవరికి ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. దీని తర్వాత భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితంపైనా ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (sunil gavaskar) తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య సెమీ పైనల్ కచ్చితంగా హోరాహోరీగా సాగుతుందని గవాస్కర్ అంచనా వేశాడు. ఇందులో భారత్ కే ఎడ్జ్ ఉందన్నాడు. భారత్ కు ఉన్న సౌకర్యవంతమైన బ్యాటింగ్ విభాగంతో పాటు జస్ ప్రీత్ బుమ్రా రూపంలో కష్టమైన పేస్ బౌలర్ ప్రత్యర్దిపై మనకు స్వల్ప ఎడ్జ్ ఇస్తున్నారని గవాస్కర్ తెలిపాడు. పలువురు ఐపీఎల్ లో ఆడిన ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రస్తుత జట్టులో ఉండటం వారికి కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.

పేసర్ బుమ్రా, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మధ్య జరిగే పోరాటమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించబోతోందని గవాస్కర్ తెలిపాడు. కాబట్టి పవర్ ప్లేలో బుమ్రాను ముందుగానే బౌలింగ్ కు దించాలని సూచించాడు. కొత్త బంతితో బౌలింగ్ వేసే బుమ్రా.. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ లో బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ ను అవుట్ చేయగలిగితే భారత్ గెలిచినట్లేనని అంచనా వేశాడు. అలాగే భారత్ కు ఎడ్జ్ ఇస్తున్న మరో అంశం తిలక్ వర్మ బ్యాటింగ్ స్ధానం. అతను ఏ స్ధానంలో అయినా బ్యాటింగ్ వచ్చి రాణించే అవకాశం ఉండటం భారత్ కు మేలు చేస్తుందని గవాస్కర్ తెలిపాడు. అతనో తెలివైన క్రికెటర్ అని విశ్లేషించాడు.












Click it and Unblock the Notifications