టీ20 వరల్డ్ కప్ పై సీవీ ఆనంద్ షాకింగ్ లెక్క..! ఆ మ్యాచ్ ఓడిపోతేనే..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)పై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిధ్యమిస్తున్న భారత్ కచ్చితంగా ఈ టోర్నీ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారత్ ఇప్పటికే గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచి సూపర్ 8కు చేరుకుంది. ఇక్కడి నుంచి సూపర్ 8 దశలో అదే జోరు కొనసాగిస్తే సెమీస్ కూ, ఫైనల్ కూ చేరి కప్పు చేజిక్కించుకుంటుంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ అంచనా బయటికి వచ్చింది.
స్వతహాగా క్రికెటర్ అయిన తెలంగాణ హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్ (CV Anand).. క్రికెట్ పై తన అంచనాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇదే క్రమంలో ఆయన తాజాగా జరిగిన భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ కు సంబంధించి కూడా తన అంచనాలను షేర్ చేశారు. ఇందులో ఆయన నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓడిపోవాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీవీ ఆనంద్ ఎందుకిలా భారత్ ఓటమి కోరుకున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది.

Was reading this and felt “ would have been better to lose this one !” Am a firm believer of the LOA s ( Law of Averages) due to my own experiences! One loss somewhere in the league stage , along the route to the finals , helps win trophies !
— CV Anand IPS (@CVAnandIPS) February 19, 2026
What say ? I know some of you don’t… pic.twitter.com/KbqmmR6sPL
సీవీ ఆనంద్ విజయాల సగటు సూత్రం (law of averages) ప్రకారం భారత్ తన చివరి గ్రూప్ దశ మ్యాచ్ ను ఓడిపోతేనే ఆ తర్వాత వరుస విజయాలతో ట్రోఫీ కైవసం చేసుకుంటుంది. అలా కాకుండా వరుసగా గెలుస్తూ పోతే చివర్లో బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. నెదర్లాండ్స్ పై భారత్ గెలిచిన మ్యాచ్ కథనం పేపర్ లో చదువుతున్నప్పుడు "దీన్ని ఓడిపోయి ఉంటే బాగుండేది!" అనిపించిందన్నారు. తన సొంత అనుభవాల వల్ల తాను LOA (సగటుల చట్టం) ని గట్టిగా నమ్ముతానన్నారు. లీగ్ దశలో ఎక్కడో ఒక చోట, ఫైనల్స్‌కు వెళ్లే మార్గంలో ఒక ఓటమి ట్రోఫీలు గెలవడానికి సహాయపడుతుందన్నారు. ఏమంటారు? మీలో కొందరు అంగీకరించరని నాకు తెలుసు అంటూ ట్వీట్ ముగించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications