చరిత్ర సృష్టించిన నిఖత్.. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ లో స్వర్ణం కైవసం
భారత్ స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో అదరగొట్టింది. ఫైనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఛాంపియన్ షిప్ లో ఆమె మహిళల 51 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచింది.

గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నిఖత్ 5-0 తేడాతో చైనాలోని తైపీకి చెందిన గువోయి జువాన్ ను ఓడించింది. ఫైనల్ బౌట్ మొత్తంలో ఎంతో ధైర్యం, దూకుడుగా ఆడింది నిఖత్. నైపుణ్యం అద్భుతంగా ప్రదర్శించి మువ్వన్నెల జెండాను మరోమారు ప్రపంచ వేదికపై ఎగురవేసింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలించింది. సెమీస్ లో ఉజ్బెకిస్థాన్ కు చెందిన బాక్సర్ గుల్సెవర్ పై విజయం సాధించి.. టైటిల్ పోరుకు దూసుకొచ్చింది నిఖత్.
🇮🇳 Nikhat Zareen claims GOLD at the World Boxing Cup Finals 2025 🥈
— ESPN India (@ESPNIndia) November 20, 2025
She beat Guo Yi Xuan 5-0 in the women's 51kg 🔝
➡️ Read more: https://t.co/YISFJ5IPrP pic.twitter.com/kLm0nvUUjU
ఈ టోర్నీలో నిఖత్ తోపాటుగా ఇతర మహిళా బాక్సర్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. వీరిలో మీనాక్షి హూడా(48 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), అరుంధతి చౌదరి(70 కేజీలు), నుపుర్ షోరాన్(84కేజీలు), జాస్మిన్(57 కేజీలు), పర్విన్(60 కేజీలు) బంగారు పతకాలను సాధించారు. ఇక తెలంగాణలోని ఇందూర్ కు చెందిన నిఖత్ జరీన్.. 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించింది.
#NDTVExclusive | निखत जरीन ने वर्ल्ड बॉक्सिंग कप में जीता गोल्ड, तेलंगाना सरकार से अपनी एकेडमी के लिए जमीन की मांग की #NikhatZareen | #WorldBoxingCupFinals | @Vimalsports | @nikhat_zareen pic.twitter.com/RTGhOw9Ex3
— NDTV India (@ndtvindia) November 20, 2025
అలాగే 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తాజాగా గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ సాధించడంతో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications