India Pakistan Match : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో గెలిచేదెవరో చెప్పేసిన గూగుల్..!
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ మ్యాచ్ లో విజేత ఎవరన్న దానిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున బెట్టింగ్స్ సాగుతున్నాయి. అలాగే మాజీ క్రికెటర్లు కూడా తమ అంచనాలను ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో గూగుల్ కూడా తన అంచనాను చెప్పేసింది.
ఇవాళ నరేంద్ర మోడీ స్డేడియంలో జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో గెలుపు అవకాశాలపై ఎప్పటిలాగే గూగుల్ తన అంచనాల్ని ప్రకటించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ మ్యాచ్ విజేత అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న దానిపై క్లారిటీ ఇచ్చేసింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఈ అంచనాల్లో మార్పులు ఉన్నా లేకున్నా ముందుగా వేసుకున్న అంచనా ప్రకారం చూస్తే భారత్ కు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నట్లు అంచనా వేసింది. దీన్ని శాతంలో కూడా పేర్కొంది.

ఇవాళ్టి భారత్-పాక్ మ్యాచ్ లో విజేతగా నిలిచే అవకాశాలు టీమిండియాకు 68 శాతం ఉంటే పాకిస్తాన్ కు కేవలం 32 శాతం మాత్రమే ఉన్నట్లు గూగుల్ అంచనా వేసింది. తద్వారా భారత్ ఈ మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించడం ఖాయంగా కనిపిస్తోంది. గూగుల్ అంచనాలే నిజమైతే భారత్ వన్డే వరల్డ్ కప్ లలో ఇప్పటివరకూ పాకిస్తాన్ పై కొనసాగిస్తున్న జైత్రయాత్ర ఇవాళ కూడా కొనసాగబోతోందని అంచనా వేసుకోవచ్చు.
ఇవాళ్టి మ్యాచ్ లో భారత్ కు ఓపెనర్ శుభ్ మన్ గిల్ తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే మోడీ స్టేడియంలో గిల్ కు సూపర్ రికార్డు ఉంది. దీంతో గిల్ రాకతో పాటు ఇప్పటికే రాణిస్తున్న టాప్ ఆర్డర్, స్పిన్నర్లు కలిస్తే పాకిస్తాన్ ను మట్టికరిపించడం అంత కష్టమేమీ కాదు. మరోవైపు వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే పాకిస్తాన్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉన్న భారత్ మూడో స్ధానంలో ఉంది. పాకిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతో ఉన్నా నాలుగో స్ధానంలో ఉంది.












Click it and Unblock the Notifications