హార్దిక్ పాండ్యా భార్య సంచలనం..ఒకరు రోడ్డున పడబోతున్నారంటూ పోస్ట్
క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా సంచలన పోస్ట్ షేర్ చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు..'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే... టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు. అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది.
ఇదిలా ఉంటే నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి అనుగుణంగానే నటాషా ప్రవర్తన కూడా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. నటాషా ఐపీఎల్ ప్రతి సీజన్‌లో కనిపించేవారు. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు.అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది.

దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం. ఇదే సమయంలో నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications