IPL 2024: ఈసారి ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సంపాదన ఎంతో తెలుసా ?

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే ఐపీఎల్ 17వ ఎడిషన్ పై అభిమానుల్లో ఎంతగా అంచనాలు పెంచేస్తుందో.. ఆటగాళ్లు, కెప్టెన్లకు అంతగా ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. గత ఎడిషన్లతో పోలిస్తే చాలా జట్లలో ఆటగాళ్ల రెమ్యునరేషన్లు భారీగా పెరిగాయి. అలాగా కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న ఆటగాళ్ల రేంజ్, ఆదాయం కూడా పెరిగింది. అయితే కెప్టెన్లు వారి స్ధాయి, రేంజ్, అనుభవం, ఇతర అంశాల ఆధారంగా ఆయా ఫ్రాంచైజీలు రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నాయి.

గతంలో జరిగిన ఐపీఎల్ ఎడిషన్ల కంటే ఈసారి టోర్నీ మరింత హోరాహోరీగా టోర్నీ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటే కెప్టెన్లకు చెల్లించే రెమ్యునరేషన్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో కెప్టెన్ల సంపాదనను ఓసారి పరిశీలిద్దాం. లక్నో సూపర్ జెయింట్స్ కు నేతృత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ సంపాదన రూ. 17 కోట్లుగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు రూ.16 కోట్లు చెల్లిస్తున్నారు.

here are the earnings of captains in ipl 2024 season

ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఎంపికైన హార్ధిక్ పాండ్యాకు జట్టు ఫ్రాంచైజీ రూ.16 కోట్లు చెల్లిస్తోంది. ఆ తర్వాత స్ధానంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు రూ.14 కోట్లు చెల్లిస్తున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ కు నాయకత్వం వహిస్తున్న శ్రేయర్ అయ్యర్ కు జట్టు ఫ్రాంచైజీ రూ.12.25 కోట్లు చెల్లిస్తోంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఎప్పటి నుంచో కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి రూ.12 కోట్లు చెల్లిస్తున్నారు.

ఆ తర్వాత స్దానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ కు రూ.8.25 కోట్లు చెల్లిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఎంపికైన శుభ్ మన్ గిల్ కు రూ.8 కోట్లు చెల్లిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీకి రూ. 7 కోట్లు లభిస్తున్నాయి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ కు అత్యల్పంగా రూ.2.5 కోట్లు చెల్లిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+