ఆ గ్రౌండ్‌లో భారత్‌పై పాకిస్తాన్‌దే డామినేషన్‌..తేడా వచ్చిందంటే దబిడి దిబిడే

ఛాంపియన్స్‌ ట్రోఫీలో హైఓల్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సూపర్ సండే మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధమయ్యారు.బంగ్లాదేశ్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా టీమిండియాను ఓడించాల్సిందే. అంటే పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ చావో రేవో వంటిది.అయితే గతంలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఓడించిన అనుభవం పాకిస్థాన్‌కు ఉంది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును పాకిస్థాన్ ఓడించింది. ఎనిమిదేళ్ల పగ తీర్చుకునేందుకు భారత్ రంగంలోకి దిగనుండగా, మరోసారి భారత్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది.

High-octane match between Team India vs Pakistan in the Champions Trophy

అయితే దుబాయ్ పిచ్ కచ్చితంగా పాక్ జట్టుకే అనుకూలంగా ఉండనుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దుబాయ్ మైదానం పాక్‌కు హోం గ్రౌండ్ వంటిది. టెర్రరిస్ట్‌ దాడుల తర్వాత ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటానికి ముందుకు రాలేదు.అప్పటి నుంచి పాకిస్థాన్‌ దుబాయ్ వేదికగా క్రికెట్ ఆడుతోంది.

దీంతో దుబాయ్ పిచ్ ప్లస్‌లు , మైనస్‌లు ఆ జట్టుకు బాగా తెలుసు.ఈ వేదికపై భారత్-పాకిస్తాన్‌ జట్లు 28 వన్డే మ్యాచ్‌లలో తల పడ్డాయి. వాటిలో పాకిస్తాన్‌ 19 మ్యాచ్‌లలో గెలిస్తే.. భారత్ కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. అంటే.. దుబాయ్‌ గ్రౌండ్‌లో భారత్‌పై డామినేషన్‌ పాకిస్తాన్‌దే.కాబట్టి టీమిండియా పాకిస్థాన్ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆదివారం జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి ఎనిమిదేళ్ల పగను టీమిండియా తీర్చుకుంటుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+