icc world cup 2023: ఇలా చేస్తే కివీస్ పై సెమీస్ గెలిచేయొచ్చు! హర్షాభోగ్లే కీలక సూచన..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో వరుసగా 9 విజయాలతో సెమీస్ లోకి దర్జాగా అడుగుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు కివీస్ తో జరిగే నాకౌట్ పోరును కూడా అంతే సులువుగా గెలుస్తుందన్న అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే పైకి ఎంత ధీమాగా కనిపిస్తున్న టీమిండియాలో మాత్రం ఎక్కడో మూల గతానుభవాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నాకౌట్ పోటీల్లో ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించాలి, కివీస్ వంటి ప్రొఫెషనల్ గా ఆడే జట్లను ఎలా వెనక్కి నెట్టాలన్న దానిపై టీమిండియాకు పలువురు మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ కామెంటేటర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో భారత్ కు చెందిన హైదరాబాదీ సీనియర్ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ఇప్పుడు కివీస్ తో భారత్ నాకౌట్ పోరుపై విశ్లేషించాడు. ఈ సందర్భంగా టీమిండియా ఏం చేస్తే ఈ నాకౌట్ ఒత్తిడిని అధిగమించి సులువుగా గెలిచే అవకాశం ఉంటుందో తాజాగా ఐసీసీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా వివరించాడు. దీంతో ఇప్పుడు హర్షాభోగ్లే చేసిన సూచనపై చర్చ జరుగుతోంది. వేలకొద్దీ మ్యాచ్ లకు కామెంటేటర్ గా వ్యవహరించిన హర్ష సూచనలు ఏంటో ఓసారి చూద్దాం.

భోగ్లే ఐసీసీ రివ్యూ పోడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ బ్రియాన్ ముర్గాట్రాయిడ్‌తో ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా జైత్రయాత్రపై చర్చించారు. అలాగే టోర్నమెంట్ ఆతిధ్య జట్టు సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హర్షా అంచనా వేస్తున్నాడు. తాజాగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లను నిశితంగా గమనిస్తున్న హర్షా భోగ్లే.. ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారుతుందని అంచనా వేశాడు.
అలాగే భారత్-కివీస్ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తున్న వాంఖడే స్టేడియంలో రెండో బ్యాటింగ్ చేస్తునప్పుడు అంటే ఛేజింగ్ లో మొదటి 10 ఓవర్లలో లైట్ల కింద బంతి భయంకరమైన మలుపులు తిరుగుతోందని హర్షా భోగ్లే తెలిపాడు. గత నాలుగు మ్యాచ్‌లలో మొదటి 10 ఓవర్లలో పదిహేడు వికెట్లు పడ్డాయన్నాడు. కాబట్టి మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా 330 లేదా 340 పరుగులు చేయడం, అలాగే తొలి పవర్‌ప్లేలో రెండు లేదా మూడు వికెట్లు తీయడం ఉత్తమమైన మార్గమని భోగ్లే టీమిండియాకు సూచించాడు. సెమీస్ లోకి వచ్చిన జట్లను కివీస్ ఓడించలేదని, కానీ ఇక్కడ మాత్రం ఏదైనా జరగొచ్చన్నాడు.












Click it and Unblock the Notifications