వరల్డ్ కప్ ఫైనల్స్ చేరేది ఆ జట్టే: నాగ చైతన్య జోస్యం

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

రెండో సెమీస్ కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలి సెమీ ఫైనల్స్‌పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు.

ICC World Cup 2023, IND vs NZ 1st semifinals: Naga Chaitanya analysis on the match

తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్‌లో గెలిచే జట్టు ఏదో వెల్లడించాడు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఓ చిన్న ప్రొమోను విడుదల చేసింది. 2023 వరల్డ్ కప్ చేరిన టీమ్ ఇండియా అంటూ మొదలవుతుంది ఈ ప్రొమో. న్యూస్ పేపర్ చేతిలో పట్టుకుని ఈ హెడ్ లైన్‌ను చదువుతాడు అక్కినేని నాగచైతన్య.

ఫ్యూచర్ డిసైడ్ చేసి తాను చెప్పట్లేదని, జట్టు పెర్‌ఫార్మెన్స్, దూకుడును చూస్తే మీకే అర్థమౌతుందనీ వివరించాడు. తాను ఒక్కడినే కాదని, ఇండియా మొత్తం ఇదే కోరుకుంటోందని పేర్కొన్నాడు. టీమిండియా దూత (Dhoota) గా జర్నలిస్ట్.. సాగర్ అంటూ ముగించాడు.

దూత వెబ్ సిరీస్‌లో నటించాడు నాగచైతన్య. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకొంటోంది. డిసంబర్ 1వ తేదీన విడుదల కానుంది ఈ సిరీస్. ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు, తరుణ్ భాస్కర్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూపర్ నేచురల్ హారర్ జానర్‌లో రానుందీ వెబ్ సిరీస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+