icc world cup 2023: భారత్ కోరుకునే సెమీస్ ప్రత్యర్ధి ఎవరు ? పాక్, కివీస్, ఆప్ఘన్ మధ్య పోటీ !
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ దశ చివరికి చేరుకుటోంది. ఇప్పటికే ప్రతీ జట్టూ దాదాపుగా 8 మ్యాచ్ లు ఆడేశాయి. ఇక మిగిలింది చివరి మ్యాచ్ మాత్రమే. అలాగే సెమీస్ లో మూడు బెర్తులు ఖరారైపోయాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రూపంలో మూడు బలమైన జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి. ఇక మిగిలింది నాలుగో సెమీస్ బెర్తు మాత్రమే. దీని కోసం అంటే సెమీస్ లో భారత్ ప్రత్యర్ది బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి.
రాబోయే వారం రోజుల్లో జరిగే లీగ్ మ్యాచ్ ల్లో సెమీ ఫైనల్ నాలుగో బెర్త్ తేలిపోనుంది. ఇందుకోసం ఇప్పటికే ఎనిమిదేసి పాయింట్లు కలిగిన పాకిస్తాన్, న్యూజీలాండ్, ఆప్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. ఇందులో ఒకరు మాత్రమే సెమీ ఫైనల్ చేరుకుంటారు. మరో రెండు జట్లు ఇంటికెళ్లడం ఖాయం. దీంతో ఇప్పుడు ఈ మూడు జట్లకు మిగిలి ఉన్న మ్యాచ్ లలో వీరు ఎదుర్కోబోయే ప్రత్యర్ధుల ఆధారంగా వీరి సెమీస్ అవకాశాల్ని అంచనా వేయాల్సిన పరిస్ధితి.

సెమీస్ లో నాలుగో బెర్తు కోసం పోటీపడుతున్న మూడు జట్లలో న్యూజీలాండ్ రేపు శ్రీలంకను ఎదుర్కోబోతోంది. అలాగే ఎల్లుండి ఆప్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటోంది. చివరిగా నవంబర్ 11న పాకిస్తాన్ ఇంగ్లండ్ ను ఎదుర్కోబోతోంది. ఈ మూడు మ్యాచ్ ల తర్వాత కచ్చితంగా సెమీస్ నాలుగో బెర్తు ఖరారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు మ్యాచ్ లలో అద్భుతాలు జరిగితే తప్ప ఇవి ముగియగానే సెమీ ఫైనల్ నాలుగో బెర్తు రేసులో పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కీలకం కానుంది.
ఎందుకంటే ప్రస్తుత ఫామ్, జట్ల తాజా బలాబలాలను బట్టి చూస్తే శ్రీలంకపై న్యూజీలాండ్, ఆప్గనిస్తాన్ పై దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లలో న్యూజీలాండ్, పాకిస్తాన్ విజయాలు సాధిస్తే ఆ రెండు జట్లూ 10 పాయింట్లు సాధించి సమంగా నిలుస్తాయి. అప్పుడు ఇప్పటికే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న న్యూజీలాండ్ సెమీస్ కూ, పాకిస్తాన్ ఇంటికెళ్లడం ఖాయం. అయితే పై మూడు మ్యాచ్ లలో చివరిదైన ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ మెరుగైన రన్ రేట్ సాధిస్తే న్యూజీలాండ్ ను వెనక్కి నెట్టి సెమీస్ చేరడం ఖాయం. అద్భుతం జరిగి ఆప్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాను ఓడిస్తే కివీస్, పాక్ కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తేనే సెమీస్ కు చేరుతుంది.అప్పుడు ఆ రెండు జట్లూ ఇంటికెళ్తాయి.
అయితే ఇందులో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్న న్యూజీలాండ్, పాకిస్తాన్ లలో ఎవరైనా భారత్ కు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే లీగ్ దశలో ఈ రెండు జట్లను భారత్ అలవోకగా ఓడించింది.. అయితే పాకిస్తాన్ పై సెమీస్ లో గెలిస్తే ఆ కిక్కే వేరు కాబట్టి భారత్, పాకిస్తాన్ పోరు ను టీమిండియాతో పాటు ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications