icc world cup 2023: వరల్డ్ కప్ ఫైనలిస్టులు వీరే ? దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్ అంచనా..!

భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ వరుస ఓటములతో సతమతం అవుతుంటే ఎలాంటి అంచనాల్లోకుండా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలతో దూసుకెళ్లిపోతోంది. ఇక ఆతిధ్య జట్టు భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ కు వెళ్లే అవకాశం ఎవరెవరికి ఉందన్న దానిపై పలువురు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమ అంచనాలు బయటపెడుతున్నారు.

ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా మేటి ఆల్ రౌండర్, క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కలిస్ వరల్డ్ కప్ ఫైనలిస్టులపై తన అంచనాల్ని తాజాగా వెల్లడించాడు. ఇందులో నవంబర్ 19న జరిగే ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో తలపడే అవకాశం ఈ రెండు జట్లకు దక్కబోతోందంటూ కలిస్ వేసిన అంచనా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే టోర్నీలో పలు సంచనాలు నమోదవుతున్న నేపథ్యంలో కలిస్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

icc world cup 2023: south african veteran jacques kallis predicts two finalists

ఇంతకీ కలిసి అంచనా వేసిన ఆ రెండు ఫైనల్ కు వెళ్లే జట్లు భారత్, దక్షిణాఫ్రికా. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉందని కలిస్ అంచనా వేస్తున్నాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ రెండు జట్లకే ఫైనల్ కు వెళ్లే అర్హత ఉందని కలిసి వెల్లడించాడు. పాయింట్ల పరంగా కూడా టాప్ 2లో ఉన్న ఈ రెండు జట్లూ ఫైనల్ లో ఆడటం ఖాయమని కలిస్ అంచనా వేశాడు.

ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, కల్లిస్ ప్రస్తుత ఫామ్ మరియు పాల్గొనే వివిధ జట్ల ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని తన అంచనాలను వివరించాడు. ఇందులో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్‌కు మొదటి రెండు జట్లను ముందుకు తీసుకెళ్లగల బలాలు మరియు వ్యూహాలను కల్లిస్ హైలైట్ చేశాడు.

"ఇది ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ అని నేను భావిస్తున్నాను. భారత్‌ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఫేవరెట్‌గా ఉన్నప్పటికీ... ముందుకు వెళితే ఆతిథ్య దేశంగా ఒత్తిడికి లోనవుతారు. వారు నిజంగానే బాగానే కనిపిస్తున్నారు కానీ సెమీస్‌లో ఇది వారికి కూడా కొత్త ప్రారంభం అవుతుంది' అని కల్లిస్ అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+