ICC World Cup 2023 : టీమిండియాలో DRS నిర్ణయాలు తీసుకునేదెవరో తెలుసా ?
క్రికెట్ లో డీఆర్ఎస్ నిర్ణయాలు ఎంత కీలకంగా మారుతున్నాయో ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో చూస్తూనే ఉన్నాం. అంపైర్ల నిర్ణయాలను సవాల్ చేస్తూ పలు జట్లు డీఆర్ఎస్ అప్పీలు చేయడం, ఆ తర్వాత టీవీ అంపైర్ వాటిని సాంకేతిక పద్ధతుల్లో రివ్యూ చేయడం, అంపైర్ నిర్ణయం సరైనదేనని తేలితే దాన్ని కొనసాగించమని గ్రౌండ్ అంపైర్లకు చెప్పడం, తప్పని తేలితే మార్చుకోమని కోరడం చూస్తూనే ఉన్నాం. ఈ డీఆర్ఎస్ నిర్ణయాల వల్ల పలు జట్ల జయాపజయాలు కూడా మారిపోతున్నాయని తాజాగా భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తో పాటు పలుజట్ల మ్యాచ్ లు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా కూడా డీఆర్ఎస్ నిర్ణయాల ద్వారా పలుమార్లు పలు మ్యాచ్ లలో లబ్ది పొందుతోంది. అయితే రోహిత్ సేనలో డీఆర్ఎస్ నిర్ణయాలు తనే తీసుకుంటున్నాడా లేక మరెవరైనా తీసుకుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే టీమిండియా తీసుకుంటున్న డీఆర్ఎస్ అప్పీళ్లలో చాలా మటుకు సరైనవే ఉంటున్నాయి. ఇవి భారత జట్టు జైత్రయాత్రలో కీలకంగా కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా శ్రీలంకపై ఏకంగా 302 పరుగులతో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తమ జట్టులో డీఆర్ఎస్ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో వెల్లడించాడు. DRS కాల్‌లను తీసుకునే బాధ్యత వికెట్ కీపర్, బౌలర్‌లపై ఉంచుతున్నట్లు రోహిత్ వెల్లడించాడు. రోహిత్ వీరిపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. అయితే కొన్నిసార్లు డీఆర్ఎస్ నిర్ణయాలు ఫెయిల్ కావొచ్చని కూడా తెలిపాడు.
శ్రీలంకతో జరిగిన పోరులో డీఆర్ఎస్ నిర్ణయాలపై రోహిత్ వ్యాఖ్యానిస్తూ.. "తన తరఫున ఆ నిర్ణయాల్ని బౌలర్, వికెట్ కీపర్ తీసుకునేలా వదిలిపెట్టినట్లు వెల్లడించాడు. ఎందుకంటే జట్టులో ఈ విషయంలో ఎవరిని నమ్మాలనే దానిపై తనకు స్పష్టత ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్ లోనూ వారు తీసుకున్న ఓ నిర్ణయం ఫలితం ఇచ్చిందని, మరొకటి ఫెయిల్ అయిందని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే వీటిని అంత సీరియస్ గా తీసుకోనట్లే రోహిత్ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications