భారత్‌తో టీ20 సిరీస్‌ వేళ.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం: కొత్త ముఖానికి పిలుపు

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియా.. భారత్‌లో తన పర్యటనను కొనసాగించనుంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. అయిదు మ్యాచ్‌లో సిరీస్ ఇది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడింది టీమిండియా. 2-1 తేడాతో ఆ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. విశాఖతో పాటు తిరువనంతపురం, గువాహటి, నాగ్‌పూర్, బెంగళూరుల్లో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ జరుగుతాయి.

IND vs AUS 1st T20I: Aaron Hardie replaces David Warner in the series against India

ఈ సిరీస్ కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. సూర్యకుమార్ యాదవ్‌.. కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. వైస్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. మొత్తం టీ20 స్పెషలిస్టులతో కూడిన టీమ్ ఇది.

ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) దూరం అయ్యాడు. ఇందులో ఆడట్లేదని అతను ప్రకటించాడు. వరల్డ్ కప్ 2023, అంతకు ముందు నుంచీ సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నందున కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ కారణంతో జట్టుకు అందుబాటులో ఉండలేనని, స్వదేశానికి తిరిగి వెళ్తానని తెలిపాడు.

అతని అభ్యర్థనకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకారం తెలిపింది. స్వదేశానికి తిరిగి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి- భారత్‌తో ఈ సిరీస్ ఆడటానికి ఇదివరకు ప్రకటించిన జట్టులో డేవిడ్ వార్నర్ సభ్యుడు. వరల్డ్ కప్ కంటే ముందు మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు వార్నర్. దానికి కొనసాగింపుగా ఇప్పుడు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.

IND vs AUS 1st T20I: Aaron Hardie replaces David Warner in the series against India

డేవిడ్ వార్నర్ స్థానంలో కొత్త ముఖానికి చోటు కల్పించింది. ఆల్‌రౌండర్‌ కోటా కింద ఆరోన్ హార్డీ (Aaron Hardie)కి జట్టులో చోటు కల్పించింది. ఈ పరిణామాలతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. డేవిడ్ వార్నర్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడు.

ఈ టీ20 సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టులో- మాథ్యూ వేడ్ (కేప్టెన్) జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది.

బీసీసీఐ ప్రకటించిన టీమిండియాలో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+