నల్ల రిబ్బన్లతో మ్యాచ్ ఆడుతున్న రోహిత్ సేన
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత క్రికెట్ జట్టు సంతాపం తెలిపింది. ఆయన మృతి పట్ల సంతాప సూచకంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లను ధరించారు టీమిండియా ప్లేయర్లు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు.

గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. మానవీయ కోణంలో సంస్కరణలను చేపట్టిన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం.
కాగా.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్ము దులుపుతోంది. భారీ స్కోర్‌ను సాధించింది. రెండో రోజు 9 వికెట్ల నష్టానికి 461 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ క్రీజ్‌లో ఉన్నారు.
ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగడం.. రెండో రోజు మ్యాచ్‌లో హైలైట్. 140 పరుగులు చేశాడు. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అతనికి అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. టీమిండియా బౌలర్లను బెంబేలెత్తించారు.
ఈ క్రమంలో స్మిత్ సెంచరీని పూర్తి చేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. 49 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో 411 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా.
ఆ తరువాత వచ్చిన మిఛెల్ స్టార్క్‌తో కలిసి ధాటిగా ఆడాడు స్టీవ్ స్మిత్. 455 పరుగుల వద్ద స్టార్క్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత స్మిత్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. అదే స్కోర్ వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆకాష్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడబోయాడు స్మిత్. ఎడ్జ్ తీసుకున్న బంతి ప్యాడ్స్‌కు తగిలి లెగ్ స్టంప్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. దీనితో అతని మారథాన్ ఇన్నింగ్‌కు తెరపడింది.
The Indian Cricket Team is wearing black armbands as a mark of respect to former Prime Minister of India Dr Manmohan Singh who passed away on Thursday. pic.twitter.com/nXVUHSaqel
— BCCI (@BCCI) December 27, 2024












Click it and Unblock the Notifications