పాకిస్తాన్.. పారా హుషార్
India vs Bangladesh: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతోంది. బంగ్లాదేశ్‌ను ఢీకొడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చెలరేగుతోంది. బంగ్లాదేశ్‌పై తడాఖా చూపుతోంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది బంగ్లాదేశ్. ఆ నిర్ణయం శుద్ధ దండగ అనే విషయం ఇన్నింగ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింద బంగ్లా. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడ్డాయి. ఈ రెండింటినీ కూడా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా తమ ఖాతాలో వేసుకున్నారు.

తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సౌమ్యా సర్కార్‌ను పెవిలియన్ దారి పట్టించాడు షమీ. అతను వేసిన్ సీమింగ్ డెలివరీని వైడ్ మిడాఫ్ దిశగా డ్రైవ్ చేయబోయాడు సౌమ్యా సర్కార్. టైమింగ్ మిస్ అయ్యాడు. అంతే- బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో వాలింది. దీనితో ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్.
రెండో ఓవర్‌లోనూ మరో షాక్ తగిలిందా జట్టుకు. ఈ సారి హర్షిత్ రాణా వంతు. ఆ ఓవర్ నాలుగో బంతికి నాజ్ముల్ హొస్సైన్ శాంటో అవుట్ అయ్యాడు. రాణా వేసిన వైడ్ అవుట్ స్వింగర్ డెలివరీని కవర్ డ్రైవ్ ఆడబోయాడు. బంతి సరిగ్గా బ్యాట్ మీదికి రాకముందే షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని సులువుగా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. దీనితో రెండు పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.
ప్రస్తుతం మెహదీ హసన్ మిరాజ్, తన్జిద్ హసన్ క్రీజ్‌లో ఉన్నారు. వీరిలో హసన్ దూకుడుగా ఆడుతున్నాడు. 16 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఈ బౌలింగ్ తడాఖా పాకిస్తాన్‌కు డేంజరస్ బెల్స్ పంపించినట్టయింది.












Click it and Unblock the Notifications