ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌లో ఓటమి దెబ్బ: కొత్త జట్టు: నో జడేజా, నో కేఎల్ రాహుల్: ఆ ముగ్గురికీ చోటు
India vs England 2nd test: ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను దారుణంగా ఆరంభించింది టీమిండియా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంకో రోజు ఆట మిగిలి వుండగానే పరాజయాన్ని చవి చూసింది. 0-1 తేడాతో వెనుకంజ వేసింది.
తొలి ఇన్నింగ్‌లో భారీ స్కోర్ సాధించి.. పట్టు బిగించినప్పటికీ.. దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది భారత్. తొలి ఇన్నింగ్‌లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్‌లో బ్యాటర్ల తడబాటు దెబ్బకొట్టింది. గెలవడానికి కావాల్సిన 230 పరుగులను కూడా అందుకోలేక చతికిలపడింది. 202 వద్దే ఆలౌట్ అయింది.

ఈ పరాజయ భారాన్ని దిగమింగుకుంటూ రెండో టెస్ట్ కోసం సన్నద్ధమౌతోంది. ఫిబ్రవరి 2వ తేదీన విశాఖపట్నంలో షెడ్యూల్ అయిందీ మ్యాచ్. మంగళవారం రెండు జట్లూ విశాఖకు చేరుకుంటాయి. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటాయి. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇందులోనూ ఓడితే.. పుంజుకోవడం కష్టసాధ్యమే.
ఈ పరిస్థితుల మధ్య కొత్త జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఊహించినట్టే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీతో అతను బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోనే అతనికి స్కానింగ్ చేశారు. గాయం తీవ్రతపై స్టడీ చేసిన అనంతరం అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. రెండో టెస్ట్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు.
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్‌లో జడేజా రెండు పరుగులకే రనౌట్ అయిన విషయం తెలిసిందే. జో రూట్ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించినప్పుడు కాలి కండరాలు పట్టేశాయి. ఆ పరుగును పూర్తి చేయలేకపోయాడు. నొప్పితో విలవిల్లాడాడు. పెవిలియన్ దారి పట్టినప్పుడూ అతను డిస్ కంఫర్ట్‌గా కనిపించాడు.
రవీంద్ర జడేజాతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా రూల్డ్ అవుట్ అయ్యాడు. తొడ కండరాల నొప్పితో అతను బాధపడుతున్నాడు. వారిద్దరూ ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులో ఉండట్లేదు.
వారి స్థానంలో ముగ్గురు కొత్త ముఖాలను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తోన్న సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు కల్పించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ సౌరభ్ కుమార్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది.
మార్పులు చేర్పుల తరువాత కొత్త జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కేప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ ఉన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications