మనసు మార్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ: బీసీసీఐకి సమాచారం

IND vs SL: టీ20 వరల్డ్ కప్‌ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది భారత జట్టు. సీనియర్ ప్లేయర్లందరూ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. జూనియర్లతో కూడిన మరో టీమ్ ఇటీవలే జింబాబ్వే పర్యటనలో ఉంది. 4-1 తేడాతో టీ20 సిరీస్‌లో జెండా ఎగురవేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్‌పై తనదైన బ్రాండ్‌‌ను వేసింది టీమిడియా.

జింబాబ్వే పర్యటన తరువాత పూర్తిస్థాయి ప్లేయర్లతో కూడిన జట్టు.. శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే సిరీస్‌లో తలపడుతుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 27వ తేదీన సాయంత్రం 7 గంటలకు పల్లెకెలెలో ప్రారంభమౌతుంది. ఈ నెల 28, 30 తేదీలతో జరిగే మ్యాచ్‌లో టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగుస్తుంది.

IND vs SL Rohit Sharma and Virat Kohli set to play ODIs against Sri Lanka

ఆ వెంటనే- వన్డే సిరీస్ మొదలవుతుంది. 2, 4, 7 తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌‌లు షెడ్యూల్ అయ్యాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దీనికి వేదిక. ప్రస్తుతం ఈ రెండు ఫార్మట్లల్లోనూ దూకుడు మీద ఉంది టీమిండియా. ఈ రెండు సిరీస్‌లల్లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఇది- టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తొలి సిరీస్ అవుతుంది. కాగా- టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్‌గా వ్యవహరించడం దాదాపుగా ఖాయమైంది. ఈ ఫార్మట్‌కు నాయకత్వాన్ని వహిస్తూ వస్తోన్న రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ.. టీ20ల నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

నిన్నటి వరకు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదని వెల్లడించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మనసు మార్చుకున్నారు. ఈ సిరీస్ ఆడటానికి సిద్ధపడ్డారు. శ్రీలంకలో పర్యటించే భారత జట్టు ఎంపిక సమయంలో తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలంటూ సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షాతో జూమ్ కాల్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

వాళ్లిద్దరూ జట్టుకు అందుబాటులోకి రావడం వల్ల సెలెక్టర్లకు సగం భారం తగ్గినట్టయింది. రోహిత్, కోహ్లీ ఆడట్లేదంటూ మొదట్లో చెప్పడం వల్ల జట్టుకు సారథ్యాన్ని ఎవరికి అప్పగించాలనే విషయంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లేదా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేర్లను దీనికోసం పరిశీలించింది. రోహిత్ ఆడబోతోండటం వల్ల కేప్టెన్సీని అతనికే అప్పగించవచ్చు.

స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. శ్రీలంక సిరీస్‌లో ఆడట్లేదు. రిషభ్ పంత్‌ను రెండు ఫార్మట్లలోనూ ఆడొచ్చు. రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్‌, ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రెండు ఫార్మట్లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అతని పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+