Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!

హ్యామిల్టన్ లో న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ (India) ఆరంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయింది. నాలుగో టీ20లో శాంసన్ ను కాదని వైభవ్ సూర్యవంశీని తీసుకుని ఓటమిపాలైన భారత్.. ఈ మ్యాచ్ లో మాత్రం మార్పులు చేసింది. దీంతో ఓపెనర్ గా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే కివీస్ పేసర్ ఆడం మిల్నే ఆరంభంలోనే చెలరేగాడు.

Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!
Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!

ఈ సిరీస్ లో జోరుమీదున్న అభిషేక్ శర్మను రెండో ఓవర్లోనే ఒక్క పరుగు వద్ద క్యాచ్ అవుట్ చేసిన మిల్నే.. ఆ తర్వాత నాలుగో ఓవర్లో 4 పరుగులు చేసిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ వికెట్ కూడా తీశాడు. దీంతో భారత్ 19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతనికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తోడవడంతో ధారాళంగా పరుగులు రావడం ప్రారంభమైంది. దీంతో భారత్ 6 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత లాంగాన్ లో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న ఇషాన్ కిషన్ తన దూకుడు కొనసాగించాడు.

India loose early wickets Against New Zealand in 5th T20I Middle order repairing innings
T20 ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా..! తొలి జట్టుగా రికార్డు పుటల్లోకి..!
T20 ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా..! తొలి జట్టుగా రికార్డు పుటల్లోకి..!

ఇషాన్ కిషన్-శ్రేయస్ అయ్యర్ జోడీ కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ వారిని చికాకుపెట్టారు. ఇదే క్రమంలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్ కూడా జోరు కొనసాగించాడు. అనంతరం ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టిక్నర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి స్మిత్ కు దొరికాడు. ఆ తర్వాత శ్రేయర్ అయ్యర్ కూడా నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ స్మిత్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కీపర్ సీఫెర్ట్ కు దొరికిపోయాడు. దీంతో భారత్ 123 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+