India Vs Pakistan: ప్రపంచ కప్ లో మళ్లీ భారత్- పాక్ మ్యాచ్, ఇద్దరికీ డూ ఆర్ డై..!!
India Vs Pakistan match in T20 World cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరింది. సూపర్ 8 టీంలు ఖరారయ్యాయి. సూపర్ 8 మ్యాచ్ లు షెడ్యూల్ వచ్చేసింది. ఇక, ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. నాకౌట్ మ్యాచ్ లు టోర్నీలో ప్రధాన జట్లకు పరీక్షగా మారుతున్నాయి. అయితే, ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా సూపర్ 8 లో మూడు ప్రధాన జట్లతో తల పడ నుంది. అయితే, నాకౌట్ దశలో మరోసారి భారత్ - పాక్ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డై ఆర్ డై అన్నట్లుగా లెక్కలు మారుతున్నాయి.
ప్రపంచ కప్ లో ఇక సూపర్ 8 మ్యాచ్ ల ఫలితాల పైనే ఆందరి ఆసక్తి నెలకొంది. టీమిండియా సూపర్ 8 లో ఆడే మూడు టీంలు ఫిక్స్ అయ్యాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ తో సూర్య సేన తలపడ నుంది. లీగ్ దశలో నెదర్లాండ్స్ సైతం సత్తా చాటు కొనే ప్రయత్నం చేసినా.. సూర్య టీం విజయం సాధించింది. ఇక.. లీగ్ దశలో పాకిస్థాన్ ను కొలొంబో వేదికగా ఓడించిన భారత్ కు మరోసారి చిరకాల ప్రత్యర్థితో ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ 8 సమీకరణాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. లీగ్ మ్యాచ్ లో పాక్ పైన భారత్ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం సాధించింది. సూపర్ 8 లో భాగంగా పాకిస్థాన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లతో తేల్చుకోనుంది. తొలి రెండు స్థానాల్లో నిలుస్తేనే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. దీంతో.. అటు భారత్.. ఇటు పాక్ కు ఈ సూపర్ 8 మ్యాచ్ లు కీలకంగా మారుతున్నాయి. ఇక్కడ పాక్ వరుస విజయాలు సాధిస్తే తిరిగి సెమీస్ లో భారత్ తో తలపడే అవకాశం కనిపిస్తోంది.

సూపర్ 8 నుంచి మారుతున్న లెక్కలు
అయితే, పూర్తిగా తమ ఆట తీరుతో ఆకట్టుకుంటున్న టీమిండియా సూపర్ 8 లో టాప్ స్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సూపర్ 8 లో అనుకున్నట్లుగా సూర్య సేన టాప్ లో నిలిస్తే .. అదే విధంగా పాక్ తన గ్రూప్ లో రెండో స్థానంలో నిలిస్తే రెండు జట్లు తిరిగి సెమీ ఫైనల్స్ లో తల పడే అవకాశం ఖాయంగా ఉంటుంది. అలా కాకుండా.. ఇద్దరూ సెమీస్ లో వేర్వేరు జట్లతో తల పడి ఫైనల్స్ చేరుకుంటే.. అసలైన ప్రపంచ కప్ ఫైనల్ లో దాయాది జట్లు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే అది శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగే అవకాశం ఉంది. దీంతో.. ఈ రెండు జట్లు తల పడే మ్యాచ్ ఇద్దరికీ డూ ఆర్ డై గా మారనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో భారత్ పూర్తి ఆధిపత్యంతో కొనసాగుతోంది. తాజా అంచనాల మేరకు సెమీస్ లో భారత్ - పాక్ తల పడితే ఒక జట్టే ఫైనల్ చేరుతుంది. అదే ఫైనల్ లో తల పడితే ఆ మ్యాచ్ లెక్కే వేరు. దీంతో.. సూపర్ 8 నుంచి ఈ రెండు జట్లు సాధించే ఫలితాల పైన కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications