Ind Vs SA: టీమిండియా స్టార్ బ్యాటర్ సహా వీరి పై వేటు - ఫైనల్ టీం ఇలా..!!
India vs South Africa: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. టీమిండియా రాణిస్తున్న తీరుతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. సూపర్ 8 లో భాగంగా మూడు బలమైన జట్లతో టీమిండియా తల పడనుంది. అయితే.. లీగ్ మ్యాచుల్లో అభిషేక్ శర్మ వరుస జీరోలు ఫ్యాన్స్ తో పాటుగా జట్టు యాజమాన్యంకు అంతు చిక్కటం లేదు. అయితే.. సూపర్ 8 లో ప్రతీ మ్యాచ్ కీలకం కావటంతో.. కీలక మార్పులకు జట్టు సిద్దమైంది. అందులో భాగంగా పిచ్ కండీషన్లు.. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల బలాలు.. బలహీనతల ఆధారంగా మార్పులతో బరిలోకి దిగనుంది.
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-8 దశలో భారత్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో (IND vs SA) జరగనుంది. టీమ్ కాంబినేషన్ మార్పుల కారణంగా కీలక మార్పులకు జట్టు సిద్దం అవుతోంది. ఇప్పుడు అందరూ అభిషేక్ శర్మ వరుస జీరోల పైనే చర్చ జరుగుతోంది. సూపర్ 8 దశ లో అభిషేక్ ను తొలి మ్యాచ్ లో తప్పించి... సంజూ శాంసన్ కు అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది. అయితే, అభిషేక్ కు తొలి బంతి నుంచి ఎటాక్ చేయకుండా.. ముందుగా సింగిల్ తీసి.. పిచ్ - బాల్ వస్తున్న తీరు గమనించి హిట్టింగ్ కు వెళ్లాలని గవాస్కర్ లాంటి వారు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అభిషేక్ రాణించకపోయినా... దక్షిణాఫ్రికా లాంటి జట్టు పైన ఆడే సమయంలో టీం లో ఉండాల్సిందే అనే అభిప్రాయం ఉంది. సూర్యకుమార్ ఈ చర్చలో అభిషేక్ కు మద్దతుగా నిలుస్తున్నాడు. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా అభిషేక్ ఈ మ్యాచ్ లో కంటిన్యూ అవటం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి సూపర్ -8 కోసం టీమిండియా తుది జట్టుపై కసరత్తు
అదే విధంగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కు తొలి సూపర్ 8 మ్యాచ్ లో అవకాశం కష్టంగా మారింది. ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఇప్పటికే టీమ్‌లో స్థిరపడిపోయారు. దీంతో, తొలి సూపర్ 8 లో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కనిపించటం లేదు. ఇక.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో స్పిన్ పిచ్ కారణంగా అవకాశం దక్కిన కుల్దీప్ కు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఛాన్స్ కష్టమని తెలుస్తోంది. బుమ్రా గాయం కారణంగా మొదట్లో అవకాశం దక్కినా, బుమ్రా పూర్తిగా ఫిట్ కావడంతో సూపర్-8లో సిరాజ్ ఆడే అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. కాగా.. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్ జట్టుతోనూ భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మూడు మార్పుల తో తొలి సూపర్ -8 మ్యాచ్ కు టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications