జట్టులో ఎందుకన్నారు..ఇప్పుడు అతనే కాపాడాడు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌కు శుభారంభం దక్కింది. భారత బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో పాకిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది.9 ఓవర్ల వరకు పాక్ వికెట్ కోల్పోకుండా ఆడింది.అయితే 9వ ఓవర్లో బాబర్ ఆజంను హార్దిక్ పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే పాకిస్థాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. 10వ ఓవర్ రెండో బంతికి ఇమామ్ ఉల్ హక్ 1 పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సౌద్ షకీల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.అయితే వీరిద్దరి భాగస్వామ్యానికి అక్షర్ పటేల్ తెరదించాడు. అద్భుతమైన డెలివరీతో మహ్మద్ రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు అర్థ సెంచరీ చేసి జోష్ మీద కనిపించిన సౌద్ షకీల్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు.ఆ తర్వాత కుల్దీప్ మాయజాలం మొదలైంది.

సల్మాన్ ఆఘా, షాహీన్ అఫ్రిది,నసీమ్ షా వికెట్లను తీసి పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.అయితే చివర్లో పాకిస్థాన్ టెయిలెండర్లు బ్యాట్ ఝుళిపించడంతో పాక్ 240 మార్క్‌ను అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది కుల్దీప్ యాదవ్ అని చెప్పాలి.తన స్పిన్‌తో పాక్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కుల్దీప్ యాదవ్ టీంలో ఉంటాడా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ పెద్దగా రాణించలేదు.
దీంతో అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.కానీ కుల్దీప్ యాదవ్‌పై నమ్మకం ఉంచిన రోహిత్ శర్మ,అతన్ని జట్టులో కొనసాగించారు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కుల్దీప్ యాదవ్ నిలబెట్టుకుంటూ మూడు ప్రధాన వికెట్లను తీసి పాకిస్థాన్ తక్కువ స్కోర్‌కు పరిమితం అయ్యేలా చూడటంలో తన వంతు పాత్ర పోషించాడు.కుల్దీప్ యాదవ్ 3,హార్దిక్ 2,అక్షర్ పటేల్ 1,జడేజా 1,హర్షిత్ రాణా 1 వికెట్ తీశారు.












Click it and Unblock the Notifications