ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో అయిదు మ్యాచ్‌లు ముగిశాయి. అన్ని జట్లూ ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే నేటి నుంచి రెండో రౌండ్ ఆరంభమౌతున్నట్టే. ఈ రౌండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడిందీ జట్టు. ఇప్పుడు హోమ్ గ్రౌండ్‌పై పంజాబ్ కింగ్స్‌ను తలపడుబోతోంది. సొంత పిచ్‌పై ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది ఆర్సీబీ. భారీ తేడాతో నెగ్గి, పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలవాలని భావిస్తోంది.

మరోవంక- పంజాబ్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్‌ను మట్టికరిపించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఆర్సీబీని ఓడించితే.. అగ్రస్థానానికి చేరుకుంటుంది. సీజన్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన జట్టుగా నిలవగలుగుతుంది.
ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తెరమీదికి వచ్చారు. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌పై తన అంచనాలను వెల్లడించారు. ఒక్కో మ్యాచ్ ఆడేసిన నేపథ్యంలో అవి ఆడిన తీరు, గెలిచిన విధానం, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆయా టీమ్ ప్లేయర్లు చూపిన ప్రతిభ ఆధారంగా ప్లేఆఫ్స్ చేేరే జట్ల గురించి తెలిపారు.
ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయని ఆకాష్ చెప్రా అంచనా వేశారు. లీగ్స్ దశ ముగిసేసరికి ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ నాలుగింట్లో ముంబై ఇండియన్స్ మినహా మిగిలిన జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications