IPL 2024: ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్ పై చెన్నై బౌలర్ క్లారిటీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ 2024లో ఆడుతున్న అన్ని జట్లు, ప్లేయర్ల చూపూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపైనే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు ?, ఈసారి ఐపీఎల్ టోర్నీ ముగియగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా ? లేక మరికొంత కాలం వేచి చూస్తాడా అన్న అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ధోనీ టీమ్ చెన్నై బౌలర్ క్లారిటీ ఇచ్చాడు.
గత ఐపీఎల్ సీజన్ లో గాయంతో బాధపడుతూనే చెన్నై జట్టుకు ఐదో టోర్నీని అందించిన మహేంద్ర సింగ్ ధోనీపై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. గత ఐపీఎల్ తర్వాత జూన్ లో ధోనీ మోకాలికి సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత క్రమంగా ధోనీ కోలుకుంటున్నాడు. దీంతో ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్ లో ధోనీ సహచరుడు దీపర్ చాహర్ స్పందించాడు.

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారంపై పీటీఐ వార్తాసంస్ధతో స్పందిస్తూ దీపర్ చాహర్.. అతను క్రికెట్ కు ఇవ్వాల్సింది చాలా ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ధోనీ మరో రెండు, మూడు సీజన్లు ఆడగలడన్నాడు. నెట్స్ లో ధోనీ బ్యాటింగ్ చూశానని, చాలా సహజంగా ఉందని గుడ్ న్యూస్ చెప్పాడు. చాలామంది ప్లేయర్ల తరహాలో ధోనీకి కూడా ఇలాంటి గాయం అయిందని, కాబట్టి ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నాడు.
చెన్నైలో చివరి మ్యాచ్ ఆడబోతున్నట్లు ధోనీ చెప్పిన విషయంపైనా చాహర్ స్పందించాడు. దీనిపై ధోనీ మాత్రమే నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఆడటం కష్టమన్నాడు. జట్టులో ఉన్న వాళ్లంతా ధోనీతో కలిసే ఎప్పుడూ ఆడారన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్ లో తనకు ధోనీ ఇచ్చిన బ్యాకప్ ను చాహర్ మరోసారి గుర్తు చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications