Ipl 2024: ఐపీఎల్ ఫస్టాఫ్ లో రిషబ్ పంత్ ఇలా- అప్ డేట్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్..!

గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతరం కోలుకుంటున్న రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2024) కు సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఫిట్ నెస్ ఎలా ఉంది ?, ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించగలడా ?, ఆడితే బ్యాటర్ గానే ఉంటాడా ?, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడా ?.. ఇలా సవాలక్ష సందేహాలు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడేందుకు సిద్దంగా పంత్ సిద్ధంగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇప్పటికే వెల్లడించాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పంత్ పై మరో అప్ డేట్ ఇచ్చింది. పంత్ ఈసారి కూడా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ సహ యజమాని పార్ధ్ జిందాల్ వెల్లడించాడు. అలాగే రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడని తెలిపాడు.

ipl 2024: delhi capitals co-owner announce key update on rishabh pant

రిషబ్ పంత్ ఐపీఎల్ రికార్డు, తాము ఆడబోయే మ్యాచ్ లను బట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలు ఉంటాయని పార్ధ్ జిందాల్ తెలిపాడు. అలాగే ఈసారి ఐపీఎల్ ప్రథమార్ధంలో రిషబ్ పంత్ కు వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి విశ్రాంతి ఇచ్చి కేవలం బ్యాటింగ్ కే పరిమితం చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం పంత్ పూర్తిస్దాయిలో ప్రాక్టీస్ చేస్తున్నాడని, తాజాగా వార్మప్ మ్యాచ్ కూడా ఆడాడని జిందాల్ పేర్కొన్నాడు. ఈసారి పంత్ పూర్తి ఫిట్ గా ఉండి టోర్నీ మొత్తం ఆడగలడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+