IPL 2024: కేప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్ (IPL 2024 Retention) సైతం ముగిసింది. పలువురు ప్లేయర్లు ఇతర జట్లకు వెళ్లారు.

IPL 2024: Gujarat Titans names Shubman Gill as captain

ఈ సీజన్ వరకు గుజరాత్ టైటన్స్‌ (Gujarat Titans)కు కేప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జట్టును వదిలాడు. రిటెన్షన్ సందర్భంగా అతన్ని రిలీజ్ చేసింది జీటీ (GT) ఫ్రాంఛైజీ యాజమాన్యం. ఆ తరువాత అతన్ని 5.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గానీ అది నిలవలేదు. 7.50 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అతన్ని తీసుకుంది.

హార్దిక్ పాండ్యా జట్టును వీడటం ఖాయమైన నేపథ్యంలో- కొత్త సారథిని ఎంపిక చేసింది గుజరాత్ టైటాన్స్. డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పేరును ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో తమ జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథ్యాన్ని వహిస్తాడని తెలియజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

గత ఏడాదే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. ఆ ఏడాదే ఛాంపియన్‌గా నిలిచింది. అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ట్రోఫీని ఎగరేసుకెళ్లిన జట్టుగా ఆవిర్భవించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కూడా దుమ్ము లేపింది జీటీ. ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.

వరుసగా రెండు సీజన్లల్లో జట్టును ఫైనల్స్ చేర్చడంతో పాటు ఒకసారి టైటిల్ విన్నర్‌గా నిలిపిన రికార్డును సొంతం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడతను జట్టును వీడటం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?.. పాండ్యా స్థానంలో జట్టు పగ్గాలను అందుకున్న గిల్‌ ఏ స్థాయిలో కేప్టెన్‌గా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+