రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
ఈ పరిస్థితుల్లో.. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలను సృష్టించింది. కేప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసింది. అతన్ని తొలగించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంఛైజీపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారధి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కేప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ నాటికి కేప్టెన్‌గా తప్పుకోవాల్సి ఉంటుందంటూ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో ఆడటానికి అంగీకారం తెలిపాడని కూడా పేర్కొంది.

ముంబై ఇండియన్స్ ఇస్తోన్న వివరణలతో సంతృప్తి చెందట్లేదు రోహిత్ శర్మ అభిమానులు. మరింత రెచ్చిపోతున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీని తగులబెట్టారు. చెట్టుకు చుట్టిన ముంబై ఇండియన్స్ జెర్సీని ఓ అభిమాని నిప్పు పెట్టాడు. అది పూర్తిగా కాలిపోయేంత వరకూ దాన్ని అలాగే వదిలేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో వీడియోలో కొందరు అభిమానులు ముంబై ఇండియన్స్ క్యాప్‌ను నిప్పుల్లో కాల్చడం కనిపించింది. అలాగే ఆ ఫ్రాంఛైజీ జెండాలను సైతం మంటల్లో పడేశారు. ఇదే పరిస్థితి ఇక మున్ముందు కొనసాగే అవకాశాలు ఉండటంతో.. రోహిత్ శర్మ స్వయంగా కలగజేసుకోవచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications