IPL 2024: రోహిత్ శర్మను అందుకే తప్పించారట ? అసలు కారణం చెప్పేసిన రాబిన్ ఉతప్ప..!
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను తప్పించి అతని స్ధానంలో గుజరాత్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాను నియమించడం వెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. భవిష్యత్ అవసరాల కోసమంటూ ముంబై ఇండియన్స్ వినిపించిన వాదనను ఆ జట్టు ఫ్యాన్సే నమ్మలేదు. దీంతో భారీ సంఖ్యలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆ జట్టుకు గుడ్ బై చెప్పేసి సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసేశారు. ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఈ విషయం అంతా వదిలేశారు.
కానీ ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిళ్లు అందించి, వ్యక్తిగతంగానూ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించాల్సిన అవసరం వచ్చిందనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. ఈ మార్పును మూడు కోణాల్లో చూడాల్సి అవసరం ఉందని రాబిన్ ఉతప్ప తెలిపాడు. ఇందులో ఒకటి ముంబై కోణం కాగా, రెండవది హార్దిక్ పాండ్యా, మూడవది రోహిత్ శర్మ కోణం అని పేర్కొన్నాడు.

గతంలో 2013 సీజన్ మధ్యలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను తొలగించి రోహిత్‌ని తమ కెప్టెన్‌గా ముంబై నియమించినట్లు తెలియగానే.. ఆ నిర్ణయాన్ని జట్టు సీనియర్లు, అభిమానులు కూడా ముక్తకంఠంతో ఆమోదించారని ఉతప్ప తెలిపాడు.
హార్దిక్ పాండ్య గతంలో ముంబై పరిచయం చేసిన క్రికెటర్ కావడం, అందులోనూ రోహిత్ స్ధానంలో వచ్చే కెప్టెన్ పూర్తిగా ముంబై బ్యాక్ గ్రౌండ్ కలిగిన వాడు కావాలని కోరుకోవడం, అదే సమయంలో రోహిత్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ మార్పు తప్పలేదని ఉతప్ప పేర్కొన్నాడు.
రోహిత్ ఎంపిక వెనుక గత నాలుగేళ్లలో ముంబై తరఫున అతని ప్రదర్శన చూడటం కంటే ఫ్రాంచైజీ కోణంలో ఈ మార్పును చూడాలని ఉతప్ప తెలిపాడు. రోహిత్ గొప్పతనాన్ని తాను ప్రశ్నించనని, అదే సమయంలో ఫ్రాంచైజీ కోణంలో చూస్తే ముంబై 2020లో టైటిల్ గెల్చిందని, తిరిగి మూడేళ్లలో టైటిల్ గెలవలేదన్నాడు. అలాగే గత మూడేళ్లలో రోహిత్ 300 కంటే తక్కువ పరుగులు ఒక్కసారే చేశాడు. కాబట్టి బ్యాటర్‌గా విజయం లేకపోవడం, కెప్టెన్‌గా విజయం లేకపోవడం వంటి కారణాలతో రోహిత్ ను తప్పించాల్సి వచ్చిందన్నాడు.












Click it and Unblock the Notifications