IPL 2024: ముంబై కెప్టెన్సీ వార్ తీవ్రం ! ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్న రోహిత్, హార్ధిక్..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ వ్యవహారం తలనొప్పిగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ సీజన్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి అతని స్ధానంలో గుజరాత్ నుంచి మినీ వేలంలో తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యాకు అవకాశం కల్పించడం అభిమానులకు రుచించలేదు. అంతే కాదు వ్యక్తిగతంగా రోహిత్ భార్య రితికాకు కూడా నచ్చలేదు. అదే సమయంలో రోహిత్ తొలగింపుపై కోచ్ మార్క్ బౌచర్ కామెంట్స్ మరింత చిచ్చు రేపాయి.
ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్సీ నుంచి తన భర్త తొలగింపును సమర్దించిన హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కు రోహిత్ శర్మ భార్య రితికా కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదం ముదురుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా హార్దిక్ పాండ్యాతో రోహిత్ పోరు బహిరంగంగా మారుతోంది. తాజాగా వీరిద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పరస్పరం అన్ ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ పరస్పరం ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యేవారు. కానీ తాజా వివాదం నేపథ్యంలో పరస్పరం అన్ ఫాలో చేసుకున్నారు.

ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ స్ధానంలో హార్ధిక్ పాండ్యా నియామకంపై అభిమానులు ఇప్పటికే అసంతృప్తికి గురయ్యారు. ఏకంగా నాలుగు లక్షల మంది ఫాలోయర్లు ముంబై ఇండియన్స్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వీడారు. ఇప్పుడు రోహిత్, హార్ధిక్ ఇద్దరూ పరస్పరం సోషల్ మీడియా అకౌంట్లలో అన్ ఫాలో చేసుకునే వరకూ రావడం రాబోయే రోజుల్లో ఏ సమస్యకు దారి తీస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కీలకమైన ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications