ఆడిపోసుకోవాల్సింది నన్ను కాదు..: కోహ్లీకి అంబటి రాయుడు చురకలు?
Ambati Rayudu: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు క్వాలిఫయర్ 2 ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఎలిమిటనేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్ 2 ఆడే అవకాశాన్ని కోల్పోయింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 34 పరుగులు సాధించిన రజత్ పటిదార్ టాప్ స్కోరర్. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. విరాట్ కోహ్లీ- 33, ఫాఫ్ డుప్లెసిస్- 17, కామెరాన్ గ్రీన్- 27, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 0, దినేష్ కార్తీక్- 11, కర్ణ్ శర్మ- 5 పరుగులు చేశారు. చివర్లో మహిపాల్ లోమ్రార్ 33 పరుగులు చేయడం వల్ల జట్టు స్కోర్ బోర్డ్ 170ని దాటింది.ఈ టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించింది. ఇంకా ఓ ఓవర్ మిగిలివుండగానే 174 పరుగులను నమోదు చేసింది. ఈ క్రమంలో ఆరు వికెట్లను కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్- 45, రియాన్ పరాగ్- 36, షిమ్రాన్ హెట్మెయిర్- 26 పరుగులతో సత్తా చాటారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఆర్సీబీ చవి చూసిన ఈ పరాజయం..ఆ జట్టుపై విమర్శల దాడికి దారి తీసింది. ప్రత్యేకించి- టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. ఆయనపై ఆర్సీబీ అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.లీగ్స్ దశలో ఆర్సీబీ చేతిలో తాను ప్రాతినిథ్యాన్ని వహించిన మాజీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పుడూ ఆయన కన్నీరు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. తనపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ట్రోల్స్‌కూ సమాధానం ఇచ్చాడు అంబటి రాయుడు.
తాను ఎప్పుడు కూడా ఆర్సీబీ అభిమానులకు అండగా ఉంటానని వివరణ ఇచ్చాడు. తమ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుస్తుందంటూ ఎన్నో సంవత్సరాలుగా మద్దతు ఇస్తూ వస్తోన్న ఆర్సీబీ అభిమానులు అంటే తనకు ఎప్పుడూ ప్రత్యేకతేనని చెప్పారు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్లేయర్లను టీమ్‌లో తీసుకుంటే ఆర్సీబీ ఎన్నో టైటిళ్లను గెలుచుకునేదని చెప్పారు.
ఇప్పటివరకు ఆ జట్టు యాజమాన్యం మెరికల్లాంటి ఆటగాళ్లను వదులుకుందని గుర్తు చేశారు. జట్టు విజయం పట్ల శ్రద్ధ చూపించే ప్లేయర్లను తీసుకునేలా మేనేజ్‌మెంట్‌ను ఒత్తిడికి గురి చేయాలని ఆర్సీబీ అభిమానులకు సూచించారు. మెగా ఆక్షన్ నుంచి ఒక కొత్త అధ్యాయాన్ని రచించేలా జట్టును తీర్చిదిద్దుకోవాలని చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications